సీఏఏపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్మీ చీఫ్ రావత్!
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. హింసాత్మక ఆందోళనలను ఆయన ఖండించారు. అటాంటి ఆందోళనలకు నాయకత్వం వహించే వాళ్లు అసలైన నాయకులు కాదని రావత్ విమర్శించారు. నమ్మినవాళ్లను తప్పుడు మార్గంలో నడిపించేవాళ్లు లీడర్లు కానేకారు అని, దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు - కాలేజీల్లో కొంతకాలంగా ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. సీఏఏపై విద్యార్థులందరూ అనుచితర రీతిలో నిరసనలకు దిగడం మనం చూశాం. దేశంలోని అన్ని సిటీలు - పట్టణాల్లో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, వాటికి నిప్పుపెడుతూ ఆందోళనకారులు హింసామార్గంలో పయనిస్తున్నారు. వాళ్లను అలా నడిపించింది ఎవరు? దీన్ని నాయకత్వమని ఎలా అంటాం? వీళ్లా నాయకులు? దీన్ని కూడా కొంతమంది సమర్థించమేంటి అని అయన ఫైరయ్యారు.
నాయకులంటే ముందు ఉండి నడిపించడమని, నాయకులు ముందుకు వెళ్తుంటే.. వారి వెనుక జనం ఉంటారని, సరైన మార్గంలో ప్రజలను తీసుకువెళ్లేవాళ్లే నేతలని, కానీ అసమగ్రమైన పద్ధతుల్లో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లేవాళ్లు నాయకులు కారని రావత్ చెప్పారు. ఢిల్లీలో నిరసనల్ని చూసినప్పుడు తనకు బోర్డర్ లో సైనికులు గుర్తుస్తారని చెప్పారు. స్వెటర్లు - టోపీలతో చక్కగా ప్రపేర్ అయి నిరసలు చేసేవాళ్లను చూసినప్పుడు.. మైనస్ 10 నుంచి మైనస్ 45 డిగ్రీల చలి ఉండే సియాచిన్ లాంటి ప్రాంతాల్లో వీరోచితంగా విధులు నిర్వహించే జవాన్లు గుర్తుకొస్తారని ఆర్మీ చీఫ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనల పై ఇలా మాట్లాడారు. మరికొన్ని రోజుల్లో రిటైర్‌కానున్న బిపిన్ రావత్ తొలిసారిగా సీఏఏ ఆందోళనలపై తన స్పందనని తెలియజేసారు.