సరిహద్దు రేఖ సమీపంలో జమ్ముకశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాదళాల చేతిలో హతుడైన బుర్హాన్ వనీ స్థానంలో నాయకత్వం చేపట్టిన సబ్జర్ అహ్మద్ భట్ కూడా అతని తరహాలోనే ఎన్ కౌంటర్ లో మరణించాడు. శనివారం ఒక్కరోజే భట్ తో సహా మొత్తం 8 మంది ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతులయ్యారు.భట్ కు భద్రతా దళాలు ఏప్లస్ ప్లస్ ఉగ్రవాది క్యాటగిరీ ఇచ్చాయి. ఈ కరడుగట్టిన ఉగ్రవాది భగ్నప్రేమికుడు కూడా.
సబ్జర్ అహ్మద్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. అయితే ఆమె కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో విరక్తి చెంది ఉగ్రవాదుల్లో చేరిపోయాడని చెప్పుకుంటారు. ట్రాల్ పట్టణంలో దాదాపుగా అందరికీ సబ్జర్ తెలుసు. సబ్జర్ భట్ ను అనుయాయులు సబ్‌డాన్ అని పిలుస్తారు. బుర్హాన్ వనీకి బాల్యమిత్రుడైన సబ్జర్ హిజ్బుల్ లో చేరిన తర్వాత అతనికి కుడిభుజంలా పనిచేశాడు. పక్షంరోజుల క్రితం జకీర్ రషీద్ అలియాస్ జకీర్ మూసా హిజ్బుల్ నుంచి వైదొలిగిన తర్వాత సబ్జర్ ఆపరేషన్స్ చీఫ్ గా నియమితుడయ్యాడు. హిజ్బుల్ ముజాహిదీన్ నాయకత్వాన్ని చేపట్టి అతనిలాగే భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో హతుడయ్యాడు. హిజ్బుల్ విడుదల చేసిన అనేక వీడియోల్లో, ఫొటోల్లో సబ్జర్ కనిపించాడు. కాగా తాజా ఎన్ కౌంటర్ పై హిజ్బుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
సబ్జర్ తలపై ప్రభుత్వం 10 లక్షల బహుమతి ప్రకటించింది. గతమార్చిలో భద్రతాదళాల వలయంలో చిక్కుకున్న సబ్జర్ చీకటిని, నిరసనకారుల రాళ్లరువ్వుడును అడ్డంపెట్టుకుని తప్పించుకున్నాడు. గ్రామాధికారులు, భద్రతాదళాలపై పలుసార్లు దాడులకు పాల్పడ్డ ఈ ఉగ్రవాది ఇన్ఫార్మర్లు అనే నెపంతో పలువురు సాధారణ పౌరులను కూడా చంపేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/