రూ.50 కోట్లు ఇవ్వ‌కుంటే..సీఎంను లేపేస్తాం

Update: 2016-12-13 16:04 GMT
ఇటీవ‌ల వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మ‌ళ్లీ అనూహ్య రీతిలో ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కారు. అయితే ఈ ద‌ఫా మ‌మ‌త వ‌ల్ల కాకుండా ఆమెకు వ‌చ్చిన బెదిరింపుల వ‌ల్ల! కోల్‌క‌తాలోని ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌కు వ‌చ్చిన ఓ లేఖ‌లో త‌న‌కు రూ.50 కోట్లు చెల్లించాల‌ని లేనిప‌క్షంలో ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌ను చంపేస్తాన‌ని హెచ్చ‌రించాడు.  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స‌భ్యుడిని అయిన త‌న డిమాండ్ ను నెర‌వేర్చ‌కుంటే...త‌మ సంస్థ హౌరా రైల్వే స్టేషన్‌లో ఐఈడీ బాంబులతో లక్షలాది మందిని అంతం చేస్తుంద‌ని హెచ్చ‌రించాడు. అయితే ఈ లేఖ రాసింది ఎవ‌రో అని క‌నుక్కునే బాధ లేకుండా స‌ద‌రు అగంత‌కుడు ఫోన్ నంబ‌రుతో స‌హా వివ‌రాలు ఇచ్చాడు.

హెచ్చ‌రిక లేఖ క్రింది భాగంలో ఉన్న సంతకంలో సుభాశ్ చంద్ర దాస్, దూరదర్శన్ మాజీ ఉద్యోగి, సెల్ నెంబరు ఫ‌లానా అంటూ రాసి మ‌రి ఈ వార్నింగ్ ఇచ్చాడు. త‌ను డీడీలో ప‌నిచేస్తుండ‌గా కొన్న ఫ్లాట్ లో జైషే ఉగ్ర‌వాదులు ఉంటున్నార‌ని హెచ్చరించాడు. ఇదిలాఉండ‌గా ఈ లేఖ‌ను రైల్వే అధికారులు పోలీసుల‌కు అప్ప‌గించారు. దీంతో వారు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు.

మ‌రోవైపు అస‌లైన దూరదర్శన్ మాజీ ఉద్యోగి సుభాశ్ చంద్ర దాస్ తెర‌మీద‌కు వ‌చ్చాడు. పేరు, ఫోన్ నంబ‌రు త‌న‌దేన‌ని ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ చెప్పాడు. అయితే త‌ను ఆ లేఖ రాయ‌లేద‌ని పోలీసుల‌కు క్లారిటీ ఇచ్చాడు. త‌న వివ‌రణ‌తో పోలీసులు సంతృప్తి చెందార‌ని పేర్కొంటూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించార‌ని సుభాశ్ చంద్ర దాస్ మీడియాకు తెలిపారు.
Tags:    

Similar News