ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు పది పదిహేను రోజుల నుంచి ఆ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు. "సీమాంధ్ర హక్కుల జన చైతన్య సభ" పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభ అనంతపురం లోని న్యూటౌన్ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే పవన్ కల్యాణ్ కి జనాల్లో ముఖ్యంగా యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. దీంతో పవన్ సభ అని అతితక్కువ సమయానికి ముందు ప్రకటిస్తేనే జనాలు తండోపతండాలుగా వస్తారు... అలాంటిది మూడు నాలుగు వారాలముందు ప్రకటించిన సభ కావడంతో హాజరయ్యేవారి సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనాలేస్తున్నారు. దీంతో సభకు భారీజనాలు హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సుమారు 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.
ఇదే సమయంలో భద్రతా పరమైన చర్యలు అలా ఉంటే... మరోవైపు ప్రజలు, పవన్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సుమారు 600 మంది జనసేన వాలంటీర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం, మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేయడం వంటివి ఇప్పటికే మొదలెట్టేశారని తెలుస్తోంది. అలాగే రాయలసీమ జిల్లాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావచ్చన్న ఉద్దేశంతో ట్రాఫిక్ విషయంలో కూడా ఆంక్షలు విధించారు! కొన్ని చోట్ల దారులు మళ్లించిన పోలీసులు - సభకొచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు - కార్యకర్తలు - పవర్ స్టార్ అభిమానులు కృషిచేస్తుండగా... ఈ సభావేదికపై పవన్ ప్రసంగంకోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/