తెలుగుదేశం ఎంపీ - కేంద్రమంత్రి సుజనాచౌదరికి కోర్టు కేసుల పరంపర వీడటం లేదు. మారిషస్ బ్యాంక్ నుంచి ఆయన డైరెక్టర్ గా ఉన్న సంస్థలు తీసుకున్న అప్పుల చిక్కుల్లో భాగంగా తాజాగా ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. మారిషస్ బ్యాంక్ కు అప్పున్న సుజాన సంస్థ అప్పుల విచారణ కేసులో వరుసగా 3సార్లు హాజరుకానందుకు కోర్టు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.
అప్పుల చెల్లింపు - ఎగవేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ జరిపేందుకు స్వయంగా హాజరుకావాలని సుజనాచౌదరికి కోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. అయితే సుజనా వరుసగా మూడు దఫాలుగా గైర్హాజరు కావడంతో నాంపల్లి కోర్టు తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.