కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వారు.. తన నాలుగో బడ్జెట్ ను విజయవంతంగా ప్రవేశపెట్టేశారు. బడ్జెట్ మొత్తాన్ని చూసినప్పుడు.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒరిగింది పెద్దగా లేదనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే.. ఏపీకి అంతో ఇంతో ప్రయోజనం వాటిల్లిందని చెప్పాలి. అన్నింటికి మించి ఏపీ రాజధాని కోసం అమరావతి రైతులు ఇచ్చిన భూములకు సంబంధించి జైట్లీ ప్రకటించిన తాజావరం బాబు సర్కారుకు దన్నుగా నిలుస్తుందని చెప్పటంలో సందేహం లేదు. అయితే.. ఈ దన్ను దేనికి వచ్చినట్లు? అన్నది చూస్తే.. కాసింత షాక్ తినాల్సిందే.
గడిచిన మూడు బడ్జెట్లలో లేని ఈ వరం.. ఈసారే ఎందుకంటే ఆసక్తికరమైన ముచ్చట ఒకటి చెబుతున్నారు. గడిచిన మూడు బడ్జెట్లలో విభజన తాలూకు గాయాలతో విలవిలలాడుతున్నఏపీకి ఏమీ చేయని జైట్లీ మాష్టారు..ఈసారి మాత్రం అమరావతి రైతులకు తీపికబురు లాంటి మాటను చెప్పారు. నిజానికి ఈ మాట అమరావతి రైతుల కంటే కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రయోజనమని చెప్పక తప్పదు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వారి మూలధన ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వటం ద్వారా రాజధానిలో భూములు అమ్మిన రైతులు భారీ ప్రయోజనాన్ని పొందనున్నారు.
అయితే..ఇదంతా ఎందుకు ఇచ్చినట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే.. రాజకీయ వర్గాలు చేస్తున్న ఆసక్తికర వాదన ఒకటి వినిపిస్తోంది. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపులు ద్వారా మోడీ సర్కారు రెండు ప్రయోజనాల్ని పొందే వీలుందని చెప్పాలి. ఒకటి.. ఏపీ విషయంలోనూ.. ఏపీ రాజధాని నిర్మాణంలోనూ తమ సర్కారుకు ఎంతో ఆసక్తిఉందన్న విషయంతో పాటు.. అమరావతి నిర్మాణానికి తమ వంతు చేసిన సాయంగా తాజా పన్ను మినహాయింపుల్ని భవిష్యత్తులో చెప్పుకునే వీలుంది.
ఇక.. చంద్రబాబు విషయానికి వస్తే.. జైట్లీ ఇచ్చిన వరం.. తాను చేసిన కృషికి నిదర్శనంగా చెప్పొచ్చు. నిజంగానే బాబు చేసిన కృషా అంటే అవునని చెప్పాలి.ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన హోదా డిమాండ్ ను వదిలేయటమే కాదు.. దాన్నో విషయంగా లెక్కలోకి తీసుకోకుండా ఉండటంతో పాటు..హోదా మీద వెల్లువెత్తుతున్న నిరసనను బలంగా తొక్కేస్తూ.. కేంద్రం మీద ఒత్తిడిని తీసుకురానివ్వని రీతిలో బాబు చేస్తున్న ప్రయత్నాలకు మోడీ అండ్ కో ఇచ్చిన తోఫాగా తాజా వరాన్ని అభివర్ణించక తప్పదు.
ఇదే కాదు.. మోడీ సర్కారు ఇచ్చిన వరం మరో సంకేతాన్ని వివిధ రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా చెప్పొచ్చు. భూసమీకరణ పేరుతో భూముల సమీకరణకు కృషిచేస్తే.. దానికి తగ్గ ప్రతిఫలం పొందొచ్చన్న విషయాన్నితన తాజా వరంతో స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. మరోవైపు అమరావతి రైతులకు జైట్లీ ఇచ్చిన వరానికి అమరావతి రైతుల.. ఏపీ ముఖ్యమంత్రి హ్యాపీగా ఉన్నప్పటికీ.. ఈ వరం‘హోదా’ను తాకట్టు పెట్టినందుకు ప్రతిఫలంగా పొందిందన్న విషయాన్ని మర్చిపోకూడదన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/