ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కట్టబెట్టడం గురించి సామాజిక అవగాహన ప్రతివ్యక్తి ఆలోచిస్తున్నారనటం అతిశయోక్తి కాదేమో. ఆంధ్రప్రదేశ్ కు చెందిన తమకు ఆ హోదా దక్కించి రాష్ర్ట అభివృద్ధికి పాటుపడాలని కోరుతుంటే.... తెలంగాణకు చెందిన నాయకులు సైతం ఏపీకి ప్రత్యేక ఇవ్వడం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తున్న ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది.
కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకహాదాపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీ ఉన్నదని చెప్పారు. అయినప్పటికీ...ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని, ఆ రాష్ట్రాలు ఎదుర్కొనే ఆదాయలోటును భర్తీ చేయడానికి కేంద్రం నిధులివ్వాలని మాత్రమే 14వ ఆర్థిక సంఘం చెప్పిందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలోకి వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన ఆదాయాన్ని పూరించేందుకు వనరుల్ని సమకూరుస్తామని భరోసా ఇచ్చారు.
ప్రత్యేక హోదా లేనట్టేనని అరుణ్ జైట్లీ పరోక్షంగా తేల్చిచెప్పడం ఇపుడు ఏపీ వాసులకు తీవ్ర మనోవేధనకు కారణం అవుతోంది. కొద్దికాలం క్రితం తెలుగుదేశంలోని ఎంపీల బృందం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన సమయంలో ఆయన సైతం ప్రత్యేక హోదాపై పూర్తి హామీ ఇవ్వలేకపోయారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పరిశీలిస్తాం అని చెప్పడం పలు సందేహాలకు దారితీసింది. ఇపుడు ఆయన మాటను ప్రభుత్వంలో నంబర్ 2 అయిన జైట్లీగారు చెప్పారని భావిస్తున్నారు.