అజాద్.. శర్మ.. రాజాలకు జైట్లీ చూపించిందేమిటి?

Update: 2016-02-17 05:57 GMT
ఢిల్లీ జేఎన్ యూ వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఉగ్రవాది అఫ్జల్ ఉరితీత మీద సమావేశాల్ని నిర్వహించటం.. అతడి వర్థంతిని జేఎన్ యూలో నిర్వహించటం లాంటివి చేయటం.. దాన్ని వ్యతిరేకించటం.. పోలీసులు కేసులు నమోదుతో విషయం తీవ్రంగా మారింది. దీనికి తోడు.. జరిగిన విషయాల్ని సాపేక్షంగా చూసే కన్నా.. రాజకీయ కోణంలో చూసే అలవాటున్న విపక్షాల పుణ్యమా అని.. సమస్య మరింత ముదిరింది.

ఇదిలా ఉంటే.. మంగళవారం ప్రధాని మోడీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు గులాబ్ నబీ అజాద్.. ఆనంద్ శర్మ.. సీపీఐ అగ్రనేత డి.రాజాలు విచ్చేశారు. ఈ సందర్భంగా తన మొబైల్ లోని ఒక వీడియోను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చూపించారు. అఫ్జల్ గురు ఉరి తీసి మూడేళ్లు అయిన సందర్భంగా జేఎన్ యూలో నిర్వహించిన వర్థంతి సభకు సంబంధించిన వీడియోగా చెబుతున్నారు.

దీన్లో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్నది ఏబీవీపీ.. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణ అయితే.. అలాంటిదేమీ లేదని.. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్సటీకి సంబంధించి తన దగ్గర ఉన్న వీడియోను విపక్ష నేతలకు మంత్రి జైట్లీ చూపించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను.. సోషల్ నెట్ వర్క్స్ లో పలువురు షేర్ చేస్తుండటంతో హడావుడి చేస్తోంది.
Tags:    

Similar News