షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో ఫుల్ శవమై కనిపించారు. బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ తిరుగుబాటు నేతగా అవతరించి..అరుణాచల్‌ప్రదేశ్‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. 48 ఏళ్ల కలిఖోఫుల్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన 145 రోజులకు.. సీఎం పదవికి రాజీనామా చేశారు.
బీజేపీ వెన్నుదన్నుగా నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ తిరుబాటు నేతగా అవతరించి.. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని కలిఖో పుల్ చేజిక్కించుకున్నారు. ఈ పరిణామంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ వాదనను సుప్రీం సమర్థించటమే కాదు.. కలిఖోపుల్ ప్రభుత్వ ఏర్పాటును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పు పట్టింది. దీంతో.. ఆయన తన పదవికిరాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే..ఈ రోజు ఉదయం ఆయన ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందినట్లుగా గుర్తించారు. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటారని భావిస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణాలు ఏమిటన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ.. దేశ వ్యాప్తంగా ఆయన మృతి సంచలనంగా మారింది.
ఫిబ్రవరి 19న కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. జులై 13 వరకు (సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకూ) అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. కలిఖో పుల్ ఆత్మహత్యకు కారణాలు బయటకు రావాల్సి ఉంది.