ఏపీ హైకోర్టు సీజే జేకే మహేశ్వరి బదిలీకి సంబంధించి నోటిఫికేషన్ ను కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి ను సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేసినట్లు తెలుపుతూ , ఆయన బాధ్యతలు స్వీకరించాలని నోటిఫికేషన్ లో పొందుపరిచారు. . జేకే మహేశ్వరి స్థానంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులు అయ్యారు.
ఇటు ఏపీ హైకోర్టు నూతన సీజేగా సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి రానున్నారు. ఆయన బదిలీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి గత ఏడాది బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 222 క్లాజ్ (1) కింద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఆయన బదిలీని ధృవీకరించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డేను సంప్రదించిన తరువాతే రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జేకే మహేశ్వరి స్థానంలో.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కి చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామిని నియమించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఏపీ హైకోర్టుకు సీజేగా రానున్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి.. 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్లో జన్మించారు. 1985లో గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబర్ 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అనంతరం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.