ఎమ్మెల్యేల‌తో ఒట్టు వేయించుకున్న సీఎం

Update: 2017-04-28 05:04 GMT
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ -ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ విష‌యంలో ఒకింత భిన్న‌మైన అభిప్రాయాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. జాతీయ పార్టీల‌ నేత‌ల‌కు ధీటుగా బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతాడ‌ని కేజ్రీవాల్ గురించి ప‌లువురు అంచ‌నా వేయ‌గా ఆచ‌ర‌ణ‌లో అది వైప‌ల్యం అయింది. ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్ భంగపడ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డ కేజ్రీ....ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. ఏకంగా వారితో ఒట్టు వేయించుకున్నారు!

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ 48 వార్డుల్లో గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వారితో స‌మావేశం ఏర్పాటు చేయించిన‌ కేజ్రీవాల్‌ తమ పార్టీ తరపున ఎన్నికైన కౌన్సిలర్లతో పార్టీని వీడబోమని ప్రమాణం చేయించారు! ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కొత్త పార్టీకి 48 వార్డులు దక్కడం మంచి ఆరంభమేనన్నారు. ``పార్టీ కార్యకర్తల కృషి, త్యాగం వల్లే మీరు గెలిచారు..పార్టీ పట్ల విశ్వాసంతో పాటు నిజాయితీగా వ్యవహరించాలి`` అని కోరారు. ``ఇతర పార్టీల్లో అభ్యర్థులు సీట్లు కొనుక్కున్నారు. మీలో ఏ ఒక్కరూ ఆ పనిచేయలేదు..ఇదే ఒరవడిని నిజాయితీతో కొనసాగించాలి. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అవినీతికి నిలయమని,అవినీతికి వ్యతిరేకంగా ఆప్‌ కౌన్సిలర్లు గళమెత్తాలి`` అని సూచించారు.

బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మిమ్మల్ని ఆ పార్టీ లోబరుచుకునే ప్రయత్నాలు చేస్తుందని కౌన్సిలర్లను కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ సంద‌ర్భంగానే పార్టీ మార‌బోమ‌ని ప్ర‌మాణం చేయించారు. బీజేపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తే పోన్‌ లో రికార్డు చేసి వారి బాగోతాన్ని ప్రజల ముందుంచాలని అన్నారు.ఎంఎల్‌ ఏలు -పార్టీ నేతలు - కార్యకర్తలతో మెరుగైన సంబంధాలను నిర్వహించాలని కేజ్రీవాల్ హిత‌బోధ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News