ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం!

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు.

Update: 2024-12-25 01:30 GMT

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పాటైన టీటీడీ బోర్డు ప్రక్షాళన కార్యక్రమం మొదలుబెట్టింది. ఈ క్రమంలోనే తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకుండా ఉండడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు భేటీ అయిన టీటీడీ పాలక మండలి కీలక ప్రకటన చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్విమ్స్ హస్పిటల్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని, భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలదించేందుకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

భక్తులకు అందించే సేవలు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్‌ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. తిరుమలలో ఉన్న హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు చేస్తామన్నారు. అన్నప్రసాద తయారీ కేంద్రంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు, కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణకు రూ.2 కోట్ల కేటాయింపు, భక్తులు సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ వద్ద 3.6 కోట్ల రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణం, ఒంటిమిట్ట రామాలయంలో 42 లక్షల రూపాయల విలువైన బంగారు కలశం ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రుమలలో తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు.

Tags:    

Similar News