మోడీని సైకో అన్న ముఖ్యమంత్రి

Update: 2015-12-15 07:05 GMT
ప్రధాని నరేంద్రమోడీ మీద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణల మీద డిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించటంతో.. కేజ్రీకి ఎక్కడో కాలిపోయింది. తన లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ సీఎం ఉండే సచివాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించటం ఏమిటంటూ ఆయన మండిపడుతున్నారు. ఈ సందర్భంలో ప్రధాని మోడీని పిరికిపందగా.. సైకోగా అభివర్ణించటం గమనార్హం.

ఢిల్లీ రాష్ట్ర సర్కారుకు.. కేంద్రానికి మధ్య సఖ్యత లేదన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకునే నిర్ణయాలపై కేజ్రీవాల్ ఒంటికాలి మీద లేవటం.. విమర్శలు గుప్పించటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా తన కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించటంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్న రాజేంద్రకుమార్ మీద అవినీతి ఆరోపణలతో సీబీఐ సోదాలు చేపట్టింది. దీంతో.. కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే ఒక మంత్రిని.. సీనియర్ అధికారిని తనంతట తానే డిస్మిస్ చేశానని.. అలా చేసిన తొలి ముఖ్యమంత్రిని తానేనని కేజ్రీ ట్విట్టర్ లో వెల్లడించారు. తన వాళ్ల మీద ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవటమే కాదు.. వారిపైన చర్యలు తీసుకున్నానని.. అలాంటి ఎదైనా ఆరోపణలు ఉంటే.. తనకు సమాచారం ఇవ్వొచ్చని.. అలాంటిదేమీ లేకుండా ఇలా తనిఖీలు చేయటం ఏమిటంటూ మండిపడుతున్నారు.
Tags:    

Similar News