కేజ్రీపై సీబీఐకి ఏడు ఫిర్యాదులు

Update: 2017-01-05 04:47 GMT
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌-ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, ఆ రాష్ట్ర మాజీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ న‌జీబ్ జంగ్ మ‌ధ్య ఉన్న పొరాపొచ్చాల విష‌యంలో మ‌రో నూత‌న కోణం తెర‌మీద‌కు వ‌చ్చింది. కేజ్రీవాల్ ప్ర‌భుత్వంపై గ‌తంలో న‌జీబ్ జంగ్ సీబీఐకి ఫిర్యాదులు చేశారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రిపై అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ గ‌తంలో ఏడు అవినీతి ఫిర్యాదులు చేసిన‌ట్లు సీబీఐ వ‌ర్గాలు ఇవాళ వెల్ల‌డించాయి. అయితే న‌జీబ్ జంగ్ చేసిన ఫిర్యాదులపై రెండు కేసుల్లో ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు సీబీఐ స్ప‌ష్టం చేసింది. మిగ‌తా కేసుల్లో ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు సీబీఐ పేర్కొంది.

ఇటీవలే వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన న‌జీబ్ జంగ్ అంత‌కుముందే కేజ్రీ ప్ర‌భుత్వంపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసుల‌ను షుంగ్లూ ప్యానెల్‌కు పంపిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. తాజా ప‌రిణామాలు ఢిల్లీ రాజ‌కీయాల‌కు మ‌రింత వేడెక్కిస్తున్నాయి. ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌యిన రోజునే సీబీఐ ఈ వివ‌రాలు వెల్ల‌డించం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. ఈ ప‌రిణామం ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News