​కేజ్రీవాల్ ఎంత పెద్ద తప్పు చేశాడంటే ​2​

Update: 2015-12-06 04:57 GMT
కాలుష్యం కంట్రోల్ చేయటానికి కారు వాడకూడదనే అనుకుందాం. కానీ.. కారు లేని లోటును తీర్చే ప్రజారవాణా సౌకర్యం శుభ్రంగా ఏడ్చిందా అంటే అదీ ఉండదు. ఆటోల గురించి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ.. ఒక కస్టమర్ ని ఎక్కించుకోవటమా? లేదా? అన్నది ఆటో డ్రైవర్ ఇష్టం మీద ఉంటుంది. రద్దీగా ఉండే ప్లేస్ కి ఆటో అడిగితే ‘‘నేను రాను’’ అని తేల్చి చెప్పేస్తుంటారు. చిన్న చిన్న దూరాలకు మీటర్ వేయటానికి ఇష్టపడరు.ఇలాంటి ఎన్నో తలనొప్పులు ఎదురవుతుంటాయి. ఒకవేళ.. కారు రేషన్ పెడితే.. ఇక అలాంటి వారి దోపిడీకి అంతు ఉండదు.

వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆటోలు.. క్యాబ్ లు అన్నవి మచ్చుకు కనిపించవు. అలాంటి అవసర సమయాల్లో కారు రేషన్ పుణ్యమా అని కారు తీయలేకపోవటానికి మించిన శాపం మరొకటి ఉండదు కదా. ఇక.. అర్జెంట్ గా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మాటేమిటి? ఇలా ఆలోచించుకుంటూ పోతే.. కారు రేషన్ కారణంగా వచ్చిపడే కష్టాలెన్నో. అంతదాకా ఎందుకు రాత్రిళ్లు సేఫ్ గా ఇళ్లకు చేరుకోవాలంటే కారు కంటే చక్కటి ఆప్షన్ ఏముంటుంది? అలా అని కారుతోనే లోకం నడుస్తుందని చెప్పటం లేదు. కానీ.. సగటు మనిషికి ఇప్పటివరకూ ఉన్న స్వేచ్ఛను కత్తితో కోసేసిన ఫీలింగ్ ఖాయం.

నిజంగా కాలుష్యంమీద కొరడా విదల్చాలంటే.. ముందుగా కాలం చెల్లిన లక్షలాది వాహనాల్ని రోడ్డు మీదకు రాకుండా చూడటం చాలా అవసరం. కాలుష్య ప్రమాణాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేనా.. ఇష్టారాజ్యంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు ముకుతాడు వేయటం.. దశాబ్దాల తరబడి నడిపే డొక్కు బస్సులు.. లారీలు లాంటి వాటిని నియంత్రించటం లాంటి చర్యలు చేపడితే ఎంతోకొంత ఫలితం ఉంటుంది.

అంతేకానీ.. కారు మీద రేషన్ కారణంగా సంపన్నులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకకారు బదులు రెండు కార్లు కొంటాడు. ఒక కారును సరి సంఖ్యలో.. రెండో కారును బేసి సంఖ్యలో వచ్చేలా జాగ్రత్త తీసుకుంటాడు. అదే జరిగితే..కార్ల కొనుగోళ్లు మరింత ఊపందుకుంటాయి. కారు ఉండేది బలిసినోళ్లకే అన్న ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. కానీ.. అందులో నిజం కంటే అబద్ధమే ఎక్కువ. కారు కొనే వారిలో చాలామంది ప్రజా రవాణా కారణంగా విసిగిపోయి.. తమ స్థాయికి మించి కారు కొంటారు. కేవలం తమ అవసరాలు తీరటం కోసం కొనే కారు మీద ఆంక్షల కత్తి దూయటం ప్రభుత్వాలకు సరికాదు.

ఇప్పుడంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. రాజకీయాల్లోకి రాకముందే.. వచ్చిన తర్వాత ఆయన తన మారుతి వ్యాగనార్ వాడుతుండేవారు. తనకున్న ఒక్క కారుతో ఆయన ఎలాంటి అవసరాలు తీర్చుకున్నారన్న గతాన్ని కాసేపు గుర్తు తెచ్చుకుంటే.. సరి.. బేసి సంఖ్యల రూలు ఎంతటి తుగ్లక్ ఆలోచనో ఆయనకు ఇట్టే అర్థమయ్యే ఛాన్స్ ఉంది.

కారు రేషన్ కారణంగా అసలుసిసలు ఇబ్బంది అంతా సామాన్యుడికే. కొనలేక.. కొనలేక తన జీవితకాలపు కోరిక అయిన కారు కొంటే.. దాన్ని రేషన్ పుణ్యమా అని అవసరాలకు వాడుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. ఇదే కష్టం సంపన్నుడికి ఎదురైతే.. ఒక కారుకు బదులుగా రెండు కార్లు కొంటాడు. దీని వల్ల సంపన్నుడికి కలిగే నష్టం ఏమీ ఉండదు.  కానీ.. ఆ పని సామాన్యుడు చేయలేడు. దీంతో.. తిరిగి.. తిరిగి సామాన్యుడి మీదే ఈ రేషన్ విధానం ప్రభావం చూపిస్తుందని మర్చిపోకూడదు.

స్వతంత్ర భారతంలో సగటు మనిషికి సర్కారు కల్పించే సౌకర్యాలు ఏమిటో..? వసతి ఏమిటో తెలిసిందే. ప్రభుత్వం నుంచి సాయం పెద్దగా ఏమీ లేకున్నా.. తమ దారిన తాము  బతికే వారి మెడకు కారు రేషన్ లాంటి చిత్రమైన శిక్షలు వేసి వారి గిం. తు మీద కత్తి పెట్టే కన్నా.. కాస్త బుర్ర పెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతో
Tags:    

Similar News