ప్రశాంత్ కిషోర్..మళ్లీ హీరో అయిపోయాడు

Update: 2020-02-09 12:13 GMT
ప్రశాంత్ కిషోర్ మళ్లీ దేశ రాజకీయాల్లో హీరో అయిపోయాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ అధిపతి - సీఎం కేజ్రీవాల్ ను గెలిపించే బాధ్యతను భుజానా వేసుకున్న ప్రశాంత్ కిషోర్ అన్నట్టే గెలిపించబోతున్నాడు.

తాజా ఎగ్జిట్ పోల్స్ లో ఢిల్లీ పీఠం అరవింద్ కేజ్రీవాల్ దేనని పార్టీలు తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ రాగానే ఢిల్లీ సీఎం - ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. గెలుపునకు సహరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఇటీవల వచ్చిన ఎగ్జిట్ ఫలితాలతో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు మళ్లీ పనిచేశాయని తేటతెల్లమైంది.  ఆయన ఎత్తుగడలు, వ్యూహాలతో బీజేపీ చిత్తు అయిపోయింది. రెండోసారి కేజ్రీవాల్ ను ప్రశాంత్ కిషోర్ సీఎం చేస్తున్నారు. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన ప్రశాంత్ కిషోర్ తీరు ఇప్పుడు మళ్లీ మారుమోగిపోతోంది.

గతంలో కేజ్రీవాల్ కు సపోర్టుగా నిలవడంపై ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను జేడీయూ అధినేత , బీహార్ సీఎం నితీష్ పార్టీ నుంచి బహిష్కరించారు. బీజేపీతో దోస్తీ కట్టిన నితీష్ కు పీకే వ్యవహారం నచ్చక ఈ పనిచేశారు. ఇక ప్రశాంత్ కిషోర్ తాజాగా బీజేపీ తెచ్చిన సీఏఏపై కూడా వ్యతిరేకంగా మాట్లాడారు.

దేశంలోనే టాప్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నంబర్ 1 స్థానంలో నిలిచారు. ఏపీలో పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ను తన ఎన్నికల వ్యూహాలతో అఖండ మెజార్టీ సాధించిపెట్టడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. 2014లో మోడీని, ఆ తర్వాత బీహార్ లో నితీష్ - బెంగాల్ లో మమత - తమిళనాట డీఎంకేకు పనిచేస్తున్నారు.  చాలా పార్టీలను రాజకీయ అధికారంలోకి తీసుకొచ్చిన పీకే తాజాగా ఢిల్లీలో ప్రధాని మోడీకి - బీజేపీకి కోలుకోలేని షాకిచ్చారు. దీంతో మరోసారి ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆయన కోసం పార్టీలన్నీ పడిచస్తున్నాయి.


Tags:    

Similar News