భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఆప్ అధినేత - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సందర్భానుసారంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తారన్న సంగతి తెలిసిందే. అవకాశం దొరికితే మోదీపై ఒంటికాలిపై లేచే కేజ్రీవాల్ తాజాగా మరోసారి మండిపడ్డారు. పరోక్షంగా ప్రధాని విద్యార్హతలనుద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మన్మోహన్ వంటి ఉన్నత విద్యావంతుడైన ప్రధానిని దేశం కోల్పోయిందని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మోదీ విద్యార్హతలు బయటపెట్టాని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మన్మోహన్ వంటి విద్యావంతుడే ప్రధాని కావాలని దేశప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. భారత ప్రధాని కచ్చితంగా ఉన్నత విద్యావంతుడై ఉండాలని, అపుడే దేశం సుభిక్షంగా ఉంటుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ``పతనమవుతున్న రూపాయి విలువ-దేశీయ పెట్టుబడులపై ప్రభావం`` అనే అంశంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా జరిగిన ఆర్ ఎస్ ఎస్ సభలకు ప్రణబ్ ముఖర్జీ హాజరు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2019లో ప్రణబ్ తటస్థ ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రధానిగా మోదీ గ్రాఫ్ పడిపోతోందంటూ ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో ప్రణబ్ పేరు తెరపైకి రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే మన్మోహన్ వంటి వ్యక్తి ప్రధాని కావాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. గతంలో కూడా మోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ డిగ్రీ నకిలీదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీపై కేజ్రీవాల్ తాజా సెటైర్లపై పలురకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆర్ ఎస్ ఎస్ సభలకు ప్రణబ్ హాజరుకావడం - ఆయనే తటస్థ ప్రధాని అభ్యర్థి అని వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో ...ప్రణబ్ ను కేజ్రీ వ్యతిరేకిస్తున్ననేపథ్యంలోనే మన్మోహన్ పేరు తెరపైకి వచ్చిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్ ...ఆర్ ఎస్ ఎస్ సభలకు హాజరుకావడం కేజ్రీకి నచ్చలేదని - ప్రణబ్ ను బీజేపీ మద్దతుదారుడిగా కేజ్రీ భావిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.