దూరం బాగా పెరిగిపోతోంది. రోజు రోజుకూ సర్కార్ కీ ఉద్యోగులకూ మధ్య గ్యాప్ పెద్దది అవుతోంది. ప్రభుత్వమేమో తమది ఉద్యోగులతో ఫ్రెండ్లీ సర్కార్ అంటోంది. మరో వైపు ఉద్యోగులు చాలా మంది తాము ఏరి కోరి జగన్ సర్కార్ ని గెలిపించుకున్నామని, అలాంటిది తమతో చెలగాటమా అని మండిపడుతున్నారు. మొత్తానికి అటూ ఇటూ మాటల మంటలు బాగానే రాజుకుంటున్నాయి. ప్రభుత్వం ఒక్క అడుగు వెనక్కి వేసే ప్రస్తక్తి లేదు అంటోంది.
ఎన్నో కష్టాలు నష్టాలతో సర్కార్ ని నడుపుతున్నామని, అయినా కూడా పది వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోస్తూ కొత్త పీయార్సీని ప్రకటించామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇంతకంటే తాము చేసేది లేదని కూడా చెబుతున్నారు. ఇక ప్రభుత్వం మంత్రులతో నియమించిన కమిటీ కూడా కొత్త పీయార్సీ మీద ఉద్యోగ సంఘాల నేతలకు నచ్చచెప్పడానికే కమిటీ అంటున్నారు.
ఇక ఈ కమిటీ మీద కూడా ఉద్యోగ సంఘాల నాయకులు పెద్దగా స్పందించడంలేదు. ముందు ప్రభుత్వం కొత్త పీయార్సీ మీద జారీ చేసిన జీవోలను రద్దు చేసుకోవాలని, అలాగే అశుతోష్ మిశ్రా ఇచ్చిన కమిటీ నివేదికను బయటపెట్టాలని కోరుతున్నారు. అపుడే తాము చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాల నేతలలో ఒకరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు ఖరాఖండీగా చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో ఉద్యోగులు సమ్మెకి రెడీ అంటున్నారు. ఈ నెల 24న వారు సమ్మె నోటీసుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించనున్నారు. అయితే ఇపుడు ఉద్యోగులు దారికి వచ్చే పరిస్థితి ఏదీ కనిపించకపోవడంతో ప్రభుత్వం కొత్త ఆయుధాన్ని బయటకు తీస్తోంది అంటున్నారు. అదే ఎస్మా, దాని ఫుల్ ఫార్మ్ ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయిన్‌టెయినెన్స్ యాక్ట్ అన్న మాట. దీన్ని 1981లో రూపొందించారు.
ఈ చట్టం ప్రకారం ఆరు నెలల పాటు సమ్మెలు, బందులు వంటివి ఏపీలో నిషేధిస్తారు అన్న మాట. దాని ద్వారా ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కలిగించే చర్యలను అడ్డుకుంటారు. అలాగే అత్యవసర సర్వీసులకు ఆటంకం కలగకుండా చూస్తారన్న మాట. ఒక వేళ ఎస్మాను ప్రయోగించినా దాన్ని దాటి ఉద్యోగులు సమ్మెలో ఉంటే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అధికారం కూడా ఈ చట్టం మేరకు ప్రభుత్వానికి ఉంటుంది.
మరి అన్ని రకాలైన చర్చలూ అయిన తరువాతనే ఎస్మాను ప్రయోగిస్తారు. అయితే ఏపీలో చూస్తే మాత్రం ఉద్యోగులు నో చర్చలు అంటూ త్వరగానే సమ్మెకు వెళ్తున్నారు. దాంతో ప్రభుత్వం కూడా చాలా ముందుగానే ఎస్మా చట్టాన్ని ప్రయోగించేలా పరిస్థితి ఉందని అంటున్నారు. మరి ప్రభుత్వం నిజంగా ఎస్మా ప్రయోగం చేస్తే కనుక అది ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని మరింతగా పెంచుతుంది అంటున్నారు. దీని పరిణామాలు పర్యవశానాలు వైసీపీకి రాజకీయంగా ఎలా ప్రభావం చూపుతాయో కూడా చూడాల్సి ఉంటుంది.