ఫేమస్ ఎంఫైర్ అసద్ రవూఫ్ ఇక లేరు..

Update: 2022-09-15 09:34 GMT
ప్రముఖ పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ ఇక లేరు. ఆయన గుండెపోటుతో లాహోర్ లో మరణించాడు. అసద్ వయసు 66 సంవత్సరాలు. లాహోర్ లోని లాండా బజార్ లో తన బట్టల షాప్ మూసి వేసి ఇంటికి వెళ్లే క్రమంలో ఛాతిలో నొప్పితో అసద్ రవూఫ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.  అసద్ ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయాడని తేల్చారు.

అంపైర్ గా ఒక వెలుగు వెలిగాడు అసద్ రవూఫ్. 2013లో జరిగిన ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయారు. బుకీల నుంచి కాస్ట్ లీ బహుమతులు స్వీకరించినట్లు బీసీసీఐ విచారణలో తేలింది. దాంతో అసద్ అంపైరింగ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది.

రవూఫ్ 2004లో ఐసీసీ ఎలైట్ ఎంపైర్ల ప్యానెల్ లో చేర్చబడ్డాడు.  అసద్ 64 టెస్టులకు అంపైర్ గా చేశాడు. 15 మ్యాచ్ లకు టీవీ అంపైర్ గా.. 139 వన్డేలకు, 28 టీ20 మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించాడు. రౌఫ్ 2000వ సంవత్సరంలో తొలి వన్డే మ్యాచ్ కు అంపైర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. 2013 వరకూ కొనసాగాడు.

అంతకుముందు మంచి బ్యాట్స్ మెన్ గా అసద్ రవూఫ్ కు మంచి రికార్డ్ ఉంది. పాకిస్తాన్ తరుఫున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా రవూఫ్ 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 3423 పరుగులు చేశాడు.

అంపైరింగ్ కెరీర్ ముగిసిన తర్వాత అతడు అంపైరింగ్ మానేయాల్సి వచ్చింది. ఇక తర్వాత లాహోర్ లోని లాండా బజార్లో తన బట్టల దుకాణాన్ని నడుపుతూ శేష జీవితాన్ని వెల్లదీస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News