అదృష్టం ఉండాలే కానీ నిద్రపోతున్నోడిని కూడా లేపి మరీ పదవులు వస్తుంటాయి. తాజా సీన్ చూస్తే ఇదే విషయం అర్థం కాక మానదు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మిత్రుడైన మజ్లిస్ కు ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
సీఎం కేటాయించిన ఎమ్మెల్సీ అవకాశాన్ని మజ్లిస్ అధినేత ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఉత్కంటకు తెర దించుతూ తాజాగా అసద్.. తన నిర్ణయాన్ని ట్విట్టర్ లో ట్వీట్ రూపంలో పేర్కొన్నారు. మార్చి 12న ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందులో నాలుగు స్థానాల్లో టీఆర్ ఎస్ పోటీ చేస్తుండగా.. ఒక స్థానాన్ని ఎంఔఎంకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ కేటాయించిన ఒక స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా అసద్.. డబీర్ పురా కార్పొరేటర్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం మజ్లిస్ పార్టీ నేతలు పలువురు విపరీతంగా పోటీ పడినా.. చివరకూ పదవి మాత్రం డబీర్ పురా కార్పొరేటర్ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అసద్ ట్విట్టర్ లో ట్వీట్ రూపంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. సత్యవతి రాథోడ్.. ఎగ్గే మల్లేశం.. శేరి సుభాష్ రెడ్డిని ఎంపిక చేస్తూ కేసీఆర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. తాజాగా అసద్ తమ అభ్యర్థిని ప్రకటించారు. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని డబీర్ పురా కార్పొరేటర్ కు ఎమ్మెల్సీ అవకాశం రావటం వెనుక.. పార్టీకి.. ఓవైసీ కుటుంబానికి ఆయనకు అత్యంత విధేయుడిగా చెబుతారు.