మా ఇలాకాలోకి అడుగుపెట్టటానికి నీకెంత ధైర్యం అంటూ పట్టపగలు.. అందరూ చూస్తుండగానే.. పోలీస్ స్టేషన్ ఎదుటే తెలంగాణ కాంగ్రస్ పార్టీ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దాడి చేసిన సంగతి తెలిసిందే. తనకు పట్టున్న ప్రాంతంలో మరెవరూ అడుగు పెట్టకూడదన్నట్లుగా వ్యవహరించే అసద్.. తాను మాత్రం దేశంలోని పలు ప్రాంతాల్లోకి వెళ్లి.. అక్కడ స్థానికంగా ఉండే ముస్లిం ఓటుబ్యాంక్ ను కొల్లగొట్టాలన్న కొత్త వ్యూహాన్ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బికాపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నఉప ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిని బరిలోకి దింపిన అసద్.. అక్కడ పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మస్లింలు.. దళితులు ఎక్కువగా ఉన్న ఆ నియోజకవర్గంలో తమ పార్టీ జెండా రెపరెపలాడితే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటంతో పాటు.. మరికొద్ది నెలల్లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు.
తాజాగా బికపూర్ నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపట్టిన అసద్.. తాను ఎస్పీ అధినేత.. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను భయపెట్టినట్లుగా చెప్పుకున్నారు. తాను ప్రచారానికి వెళితే.. ములాయం.. అఖిలేశ్ యాదవ్ భయపడ్డారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం సృష్టించేందుకు వీలుగా జైభీం.. జై మీం అనే నినాదంతోముస్లింలను.. అణగారిన వర్గాల్ని ఏకం చేస్తానని ఆయన చెబుతున్నారు.