పాక్ లో అలా.. ఇక్కడ కాదంటున్న ఓవైసీ

Update: 2018-12-24 09:32 GMT
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ  మండిపడ్డారు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ముస్లిం వ్యక్తి మాత్రమే ఆ దేశానికి ప్రధాని కాగలడని.. కానీ భారత్ లో అన్ని వర్గాలు, మతాలు వారు ప్రధాని అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మైనార్టీలకు దేశంలో సముచిత గౌరవం ఉందని స్పష్టం చేశారు. మైనార్టీల విషయంలో భారత దేశం వ్యవహరిస్తున్న తీరు చూసి నేర్చుకోవాలని పాక్ ప్రధానికి హితవు పలికారు.

మైనారిటీలతో ఎలా మెలగాలో భారత ప్రధాని మోడీకి, భారత ప్రభుత్వానికి తాము చూపెడుతామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

అసద్ మాట్లాడుతూ ‘భారత్ లో మైనార్టీలు వివక్షకు గురి అవుతున్నారని.. అందరితో సమానం చూడడం లేదని అంటున్నారు. కానీ అది అబద్ధం. మైనార్టీలకు రాజకీయ హక్కుల విషయంలో భారత్ ను చూసి పాకిస్తాన్ చాలా నేర్చుకోవాలి’ అని అసద్ హితవు పలికారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే తిరుగుబాటుకు దారితీస్తుందని.. మీ దగ్గర అలా చేయనిస్తారా అని అసద్ పాకిస్తాన్ ప్రధానికి సూటిగా  ప్రశ్నించారు.
    

Tags:    

Similar News