‘జనగణమన’ మీద ఓవైసీ కామెంట్ ఇది..

Update: 2017-01-09 15:14 GMT
మతం పేరుతో నేరుగా రాజకీయాలు చేసే నేతల పేర్లను జాబితాగా చేస్తే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముందుంటారు. మైనార్టీలకు రక్షకుడిగా తనకు తాను అభివర్ణించుకునే ఆయన.. దేశం మొత్తంలో ఉన్న మైనార్టీలకు ఆయనేం చేశారన్నది తర్వాత సంగతి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ముస్లింల బతుకుల్ని ఎంత వరకు మార్చారన్నది బహిరంగ రహస్యం. ఇక.. ఆయన పరిధిలోని ప్రాంతంలోని మౌలిక సదుపాయాల్ని ఆయన ఏ మేరకు ఉన్నాయన్నది చూస్తే.. ముస్లింల మీద ఆయనకున్న అసలు ప్రేమ ఎంతో ఇట్టే అర్థమైపోతుంది. నోరు తెరిస్తే ముస్లింల పేరును ప్రస్తావిస్తూ.. వారి గురించి తనకున్న తపనను ప్రదర్శించే ఆయన మాటలకు.. చేతలకు ఏ మాత్రం సంబంధం లేదని పాతబస్తీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ చెబుతుంటారు.

తాజాగా ఒక మీడియాసంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలు అంశాల మీద ఆయన మాట్లాడారు. పలు వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాన్ని నేరుగా వెల్లడించిన ఆయన.. మోడీ మీద.. బీజేపీ మీద తనకున్న నెగిటివ్ ఫీలింగ్ ను అస్సలు దాచుకోలేదనే చెప్పాలి. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన జనగణమన గీతాన్నితప్పనిసరిగా ఆలపించాలన్న తీర్పుపై స్పందిస్తూ.. సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని వినిపించాలన్న సుప్రీం తీర్పు ఆదేశాలపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో తనకు తెలీదని వ్యాఖ్యానించారు.

హలాల్ చేసినదైతే బీఫ్ తినటానికి తాను ఇష్టపడతానని చెప్పిన ఆయన.. ‘‘బీఫ్ కి ప్రభుత్వాలకు ఏం సంబంధం?’’ అని ప్రశ్నిస్తూనే.. ముస్లింలలో అతివాద భావజాలం పెరిగిపోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పిన ఆయన.. తన లాంటి నాయకులు అలాంటివి పెంచి పోషిస్తానన్నవిషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.

హిందువులు చాలావరకూ సెక్యులర్ గా ఉంటారన్న ఓవైసీ.. బాగా మాట్లాడే నాయకుడు ఒకరు హిందువులను తన వైపునకు తిప్పుకున్నాడని.. దీనికి కారణం బీజేపీని పవర్ లోకి రాకుండా కాంగ్రెస్ అడ్డుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. ఇలా పలు అంశాల మీద మాట్లాడినా.. చాలా వరకూ బ్యాలెన్స్ మిస్ కాకుండా మాట్లాడటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News