శోభణం రాత్రి వధూవరుల మృతి.. అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పెళ్లి రాత్రి ఓ దంపతుల మYSTery మరణం సంచలనంగా మారింది.;
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పెళ్లి రాత్రి ఓ దంపతుల మYSTery మరణం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, సహదత్‌గంజ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్, సమీప ప్రాంతానికి చెందిన శివాని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లి వేడుకలు ఎంతో ఆనందంగా జరిగాయి, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి వేడుకను ఘనంగా నిర్వహించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు పెద్దల అంగీకారం కూడా ఉండటంతో వివాహం సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. వధూవరులు సంతోషంగా కనిపించగా, వివాహ వేడుకలు పెద్ద సంబరంగా జరిగాయి. ఊరేగింపులో నృత్యాలు, సంగీతం, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపిన సమయం ప్రతి ఒక్కరికీ మధురానుభూతి మిగిల్చింది. శివాని, ప్రదీప్ ఇద్దరూ తమ కొత్త జీవితాన్ని ఉత్సాహంగా ఆరంభించారు.
అయితే, వివాహానంతర రాత్రి ఊహించని మలుపు తిరిగింది. శోభనం గదిలోకి ప్రవేశించిన వధూవరులు మరుసటి రోజు ఉదయం బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గది తలుపులు బద్దలు కొట్టి చూసినప్పుడు, వారిద్దరూ మరణించి కనిపించారు. వధువు శివాని గొంతు నులిమి చంపబడినట్లు, వరుడు ప్రదీప్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్త జీవితాన్ని ఆరంభించిన కొన్ని గంటల్లోనే విషాదం చోటుచేసుకుంది. ఆ రాత్రి గదిలో నిజంగా ఏం జరిగిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, గది తలుపు లోపలి నుంచి లాక్ చేయబడింది, అందువల్ల ఎవరైనా బయటి వ్యక్తి ఈ ఘటనకు కారణమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రదీప్ మొబైల్‌కు రాత్రి సమయంలో ఏదైనా సందేశం లేదా ఫోటో, వీడియో వచ్చిన కారణంగా అతను ఆవేశానికి గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది.
ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ నేతృత్వంలోని పోలీసులు ఇరు కుటుంబసభ్యులను విడివిడిగా విచారిస్తున్నారు. వివాహం జరిగిన 24 గంటల్లోనే ఈ విషాదం చోటుచేసుకోవడం అందరికీ శోకం మిగిల్చింది. అసలు ఆ రాత్రి ఏమి జరిగిందో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక మరిన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.