హైదరాబాద్ లో దారుణం.. పిల్లలకు విషమిచ్చి సూసైడ్ చేసుకున్నభార్యభర్తలు!

కల్వకుర్తికి చెందిన 44 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఏడాది క్రితం హబ్సిగూడకు వచచింది.;

Update: 2025-03-11 05:00 GMT

సోమవారం రాత్రి వేళ హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసిన ఒక విషాదం అయ్యో అనిపించేలా మారింది. ఆర్థిక సమస్యల కారణంగా ఒక నిండు కుటుంబం బలైంది. కొడుకు.. కూతురికి విషమిచ్చి చంపేసి.. భార్యభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషాదం కంటతడి పెట్టేలా చేసింది. కల్వకుర్తికి చెందిన 44 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చింది. అతను కొంతకాలం ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేసి మానేశారు.

ఆర్నెల్లుగా జాబ్ లేకపోవటంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. దీంతో సోమవారం 15 ఏళ్ల కుమార్తె శ్రీతరెడ్డి ని ఉరి వేసి.. పదేళ్ల కుమారుడు విశ్వాన్ రెడ్డికి విషమిచ్చి చంపినట్లుగా భావిస్తున్నారు. అనంతరం భార్య కవిత (35)తో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ఉరి వేసుకొని చనిపోయినట్లుగా భావిస్తున్నారు.

ఈ మరణాల్ని అనుమానాస్పద మరణాలుగా భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. తమ చావుకిఎవరూ కారణం కాదని.. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించాలని పేర్కొన్నారు. కెరీర్ లోనూ.. శారీరకంగా.. మానసికంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. షుగర్ తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నట్లుగా సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News