మిత్రుడు కేసీఆర్ ను అక్బర్ ఏమన్నారు?

Update: 2016-02-05 05:08 GMT
మాటల్ని తూటాల్లా దింపగలగిన నేతల్లో మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఒకరు. విద్వేషపూరిత మాటల్ని ఆసువుగా చెప్పటంతో పాటు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటే. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో ప్రసంగించిన సందర్భంగా ఆయన ప్రసంగానికి సంబంధించిన అంశాలు కొన్ని కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇందులో.. మిత్రుడు కేసీఆర్ ను మొదలుకొని.. పాత మిత్రుడు కాంగ్రెస్ పార్టీ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనవరి 31న పాతబస్తీలోని బాబానగర్ లో చేసిన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో తమ పార్టీకి మిత్రపక్షంగా ఉంటామని మజ్లిస్ చెప్పిందని.. అందుకే తమ మిత్రుడు అయ్యాడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొస్తే.. అందుకు భిన్నంగా కేసీఆర్ పై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వింటే షాకింగ్ గా ఉంటాయి. మిత్రుడు కేసీఆర్ ను.. అక్బర్ ఏమన్నాడో తెలిస్తే విస్మయం చెందక మానదు. సెక్రటేరియట్ కడతానని చుట్టూ తిప్పాడు.. కట్టాడా? అని ప్రశ్నించి.. బరిబాతలోడు.. మీకేం కట్టగలడు అంటూ తీవ్రస్థాయిలో కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఫీజులు ఇవ్వలేనోడు 30 లక్షల మందికి ఇళ్లు కడతాడా? అంటూ ప్రశ్నించారు.

తన ప్రసంగంలో భాగంగా అక్బర్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు చూస్తే..

‘‘కాంగ్రెస్ పార్టీని దేశమంతా వెంటాడతా. ప్రధాని మోడీతో కలిసి కాంగ్రెస్ ను సర్వనాశనం చేసి.. ఆ శవాన్ని మోడీతో కలిసి మోస్తా’’

‘‘ఇందిరాగాంధీ దారుస్సలాం గడప తొక్కిం. మేమెప్పుడూ గాంధీభవన్ గడప తొక్కం. కానీ సోనియా.. రాహుల్ గాంధీలతో దారుస్సలాం గడపను నాకిస్తా’’

(మజ్లిస్ పార్టీ కార్యాలయాన్ని దారుస్సలాం అంటారు)

‘‘ముస్లింలు నలుగురు భార్యలను పెళ్లాడుతున్నారు. పదిమందిని పుట్టిస్తున్నారని అంటున్నారు. వారూ నలుగురు భార్యలను పెళ్లాడి.. పదిమందిని కనాలి’’

‘‘దేశంలో అందరి కంటే మోసగాళ్లు.. వెన్నుపోటుదారులు కాంగ్రెస్ వాళ్లే. వ్యభిచారులు హరామ్ డబ్బు తినే.. విశ్వాసం లేని మోసగాళ్ల పార్టీ అది’’

‘‘బాబ్రీ మసీదు తాళం తీసింది.. శిలాన్యాస్ చేసింది.. విగ్రహాలు పెట్టింది.. మన గుండెల్లో తూటాలు దింపిందీ కాంగ్రెస్సే’’

‘‘ఒక వ్యభిచారి పాతబస్తీలో తిరుగుతూ తమ వల్ల ఆస్తులు కూడగట్టారని చెబుతున్నాడు. మాపై సీబీఐ విచారణ జరుపుతామంటున్నాడు. తాగుబోతు.. హరామ్ డబ్బు తినేవాడు.. చీకటిపడితే ఆడవాళ్ల సహకారం లేకుండా ఇంటికి వెళ్లలేనోడు మాపై విమర్శలు చేస్తాడా?’’ అంటూ ఒక కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డారు.

‘‘వందకోట్ల మంది ఉన్న దేశంలో కాంగ్రెస్ కు వారసుడే దొరకలేదా? ఇటలీ బొమ్మను తెచ్చుకొని పెట్టుకున్నారు. గుజరాత్ ను తగలబెట్టింది ఎవరు? 2004లో ఇటలీ బొమ్మ అధికారంలో లేదా? మోడీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీజేపీని చూపి భయపెడుతూ ముస్లింల ఓట్లు కొల్లగొడుతున్నారు’’

‘‘ముంబయిలోని అంబానీలు కట్టిన ఇళ్లు వక్ఫ్ భూమిలోనే ఉన్నాయి. ఆ భూమిని కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీనే’’

‘’50 ఏళ్ల క్రితం ముస్లింలు టోపీలు పెట్టుకొని బేగంబజార్ నుంచి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. మజ్లిస్ వచ్చాకే పరిస్థితి మారింది. హైదరాబాద్ లో ముస్లింలు నిద్రపోతుంటే.. మజ్లిస్ కాపలా ఉంటుంది’’
Tags:    

Similar News