సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా తన మార్క్ వ్యాఖ్యను చేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డి.. మోడీ కేబినెట్ లో ముఖ్యమైన హోంశాఖకు కేంద్ర సహాయ మంత్రిగా ఎంపిక కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి రాజాసింగ్ కొన్ని సూచనల పేరుతో వినతులు చేశారు.
ఈ సందర్భంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై సంచలన ఆరోపణలు చేశారు. పాగబస్తీ నుంచి తీవ్రవాదులను ఏరివేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు.
దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. దానికి సంబంధించిన మూలాలు పాతబస్తీలో దొరికాయని తాను గతంలో అన్నానని.. తీవ్రవాదులకు చట్టపరమైన సాయం అందిస్తామని తనతో ఒక ఎమ్మెల్యే చెప్పారన్నారు. అలాంటి వ్యాఖ్య చేసిన సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు.
మజ్లిస్ అధినేత మీద పరోక్షంగా విమర్శలు చేసిన రాజాసింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే అసద్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటంతో కిషన్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. కిషన్ వ్యాఖ్యలపై అమిత్ షా సైతం సీరియస్ కావటం.. ఆయన్ను క్లాస్ పీకినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా రాజాసింగ్ చేసిన విమర్శలకు అసద్ తీవ్రంగా రియాక్ట్ కావటం ఖాయం. 2024లో జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై బీజేపీ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ కారణంగా ఈ తరహా సంచలన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరిన్ని రావటం ఖాయం.