రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా సరాయ్ మొహల్లాలో 300 ఏళ్ల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపక్కన ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు మున్సిపాలిటీ ఏకాభిప్రాయంతో కూల్చివేస్తూ ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న శివాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర దుమారం రేపింది. స్థానికులు ఎంత వ్యతిరేకించినా ఈ ఆలయ కూల్చివేత జరిగింది. దీనిపై బీజేపీ సహా చాలా పార్టీల నేతలు, నెటిజన్లు మండిపడుతున్నారు.
తాజాగా ఈ 300 ఏళ్ల చరిత్ర గల శివాలయాన్ని కూల్చివేయడంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ఈ శివాలయం కూల్చివేతను తాను ఖండిస్తున్నానని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఓవైసీ.. అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలనే అంశాన్ని తమ పార్టీ విశ్వసిస్తుందన్నారు. ఆలయం కూల్చివేత విషయంలో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది రాజ్ గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఉందని.. ఈ మున్సిపాలిటీ బీజేపీ పాలకవర్గందేనని కాంగ్రెస్ వాదిస్తోందని ఫైర్ అయ్యారు. మున్సిపల్ బోర్డు బీజేపీ నేతృత్వంలో ఉందని.. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని ఆయన దుయ్యబట్టారు.
శివాలయాన్ని కూల్చివేయాలన్న మునిసిపల్ బోర్డు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిందని ఓవైసీ ఫైర్ అయ్యారు. ఈ కూల్చివేతలపై కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని జహంగీర్ పురిలో కూడా బీజేపీ చీఫ్ రాసిన ఓ లేఖ ఆధారంగానే కూల్చివేత జరిగిందని ఓవైసీ ఆరోపించారు. ఢిల్లీ, కార్గోన్ లేదా గుజరాత్ లో అనుసరించిన సహజ న్యాయ సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ఎవరి ఇంటిని.. మతపరమైన స్థలాన్ని కూల్చివేయలేరు అంటూ ఓవైసీ నిప్పులు చెరిగారు.