మహాకూటమిని చీల్చిచెండాడాడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఆయన చేసిన తాజా కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఇంకా ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయాలు పక్క రాష్ట్రాల్లో జరగాలా అన్న ఆయన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి..
తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో పలు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిపై అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ‘‘అది మహాకూటమి కాదని.. 2018 ఈస్ట్ ఇండియా కంపెనీ’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలను విజయవాడలో ఉండే చంద్రబాబు - ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు - నాగ్ పూర్ లోని ఆర్ ఎస్ ఎస్ నాయకులు తీసుకోవాలా’ అని ఆయన ప్రశ్నించారు.
నిన్న సంగారెడ్డి సభలో కూడా ఆయన మహాకూటమిని ఓడించాలని ముస్లిం ప్రజలకు సూచించారు. ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు - పిల్లలకు గురుకులాలు స్థాపించిన టీఆర్ ఎస్ కే ఓటు వేయాలని కోరారు. ఇప్పుడు ట్విట్టర్ లో మహాకూటమిని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చుతూ విమర్శలు గుప్పించారు.