ఉత్తరప్రదేశ్ లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయ్యి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి జెడ్ కేటగిరి భద్రతను కల్పించింది. ఓవైసీ కాల్పులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, ఆ పార్టీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కేంద్రం కూడా భారీ భద్రతను ఓవైసీకి కల్పించి భరోసానిచ్చింది.
అయితే ఆ జెడ్ కేటగిరి భద్రతను ఎంపీ అసదుద్దీన్ తిరస్కరించారు. శుక్రవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు జెడ్ కేటగిరి భద్రత వద్దని అసద్ స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి తూటాలను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తనకు భద్రత కల్పించే బదులు దేశంలో మతసామరస్యాన్ని పెంచాలని సూచించారు. ఈ విద్వేష వ్యాప్తిని ఆపాలని లోక్ సభ స్పీకర్ ను కోరారు.
తనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించకున్నా ఫర్వాలేదని.. పేదలు, అల్ప సంఖ్యాకులకు భద్రత కల్పిస్తే చాలన్నారు. అలాగే తనపై కాల్పులు జరిపిన ఉన్మాదులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాంటి వారిని శిక్షించకపోతే అతివాద ధోరణి తీవ్రవాదం కూడా పెరుగుతుందన్నారు. అలాగే తన గొంతును నొక్కేందుకు తూటాలు పేల్చాల్సిన అవసరం ఏమీ వచ్చిందని ప్రశ్నించారు.
తనకు జెడ్ కేటగిరి భద్రత వద్దని.. అందరితో సమానంగా నేను ఏ కేటగిరి పౌరుడిగా ఉండాలనుకుంటున్నానని.. నాపై కాల్పులు జరిపిన వారిపై ఊపా ఎందుకు ప్రయోగించలేదని అసద్ ప్రశ్నించారు. నా కారుపై కాల్పులు జరిపిన వారికి నేను భయపడను అని అసద్ స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ఉన్న ముస్లిం సామాజికవర్గాన్ని ఏకం చేసి సీట్లను కొల్లగొట్టేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ హైదరాబాద్ ఎంపీపై కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో అసదుద్దీన్ ఓవైసీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఓవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ కారు పంక్చరైంది.
మీరట్ లో ప్రచారం అనంతరం ఢిల్లీకి తిరిగి వస్తుండగా చాజర్సీ టోల్ గేట్ వద్ద నిందితులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే మాజీ మేయర్ హుస్సేన్ నిందితుడిపై కారు ఎక్కించారు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి.
కాగా ఓవైసీపై దాడి చేసిన కేసులో ఇద్దరు షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు కాన్వాయ్ పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్టు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని విచారిస్తున్నారు.