జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త తీసుకోండి: కేంద్రం.. వ‌ద్దంటే వ‌ద్దు: ఓవైసీ

Update: 2022-02-07 16:23 GMT
జడ్ కేటగిరీ భద్రతను అంగరీకరించాలని కేంద్ర హొంమంత్రి అమిత్ షా తనను పార్లమెంటు వేదికగా కోరారని ఎంఐఎం అధినేత, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అయితే.. సీఏఏ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన 22 మంది జీవితాల కంటే తన ప్రాణం విలువైందని కాదని, చట్టూ ఆయుధాలు లేకుంటేనే తనకు స్వేచ్ఛగా ఉంటుందని ఆయ‌న చెప్పారు.ఈ నేప‌థ్యంలో జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను తిరస్క‌రిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.  

``నా చుట్టూ ఎవరైనా ఆయుధాలతో ఉంటే నాకు నచ్చదు. నేను స్వేచ్ఛాజీవిని. స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నా`` అని ఒవైసీ తెలిపారు. ఈ నెల‌ 3న ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీకి తిరిగివస్తుండగా.. ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఛాజర్సీ టోల్గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.

మ‌రోవైపు.. అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. హాపుర్ జిల్లాకు ఒవైసీ వస్తున్నట్టు ముందస్తు సమాచారం అధికారులకు అందలేదని తెలిపారు. ఈ సందర్భంగా జడ్ కేటగిరీ భద్రతను స్వీకరించాలని ఒవైసీని కోరారు షా.  ప్రభుత్వం అందించే జడ్ కేటగిరీ భద్రతను స్వీకరించాలని  కోరారు.  జిల్లాలో ఒవైసీకి ముందస్తు కార్యక్రమాలేవీ లేవని చెప్పారు. ఘటన తర్వాత ఒవైసీ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని వివరించారు.

``ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఆయన(ఒవైసీ) సురక్షితంగా బయటపడ్డారు. ఆయన వాహనం కింది భాగంలో మూడు బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. ఘటనను ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షంగా చూశారు. వెంటనే చర్యలు తీసుకొని ఇద్దరిని అరెస్టు చేశాం. లైసెన్స్ లేని రెండు పిస్తోళ్లు, ఒక ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నాం. ఒవైసీ అక్కడ పర్యటిస్తున్నారని జిల్లా కంట్రోల్ రూమ్కు ముందుగా ఎలాంటి సమాచారం అందలేదు.`` అని షా వివ‌రించారు.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని షా తెలిపారు. కారును ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలు సేకరిస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఒవైసీకి ఇంకా భద్రతాపరమైన ముప్పు ఉందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో అస‌దుద్దీన్ జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను తిర‌స్క‌రించ‌డం స‌రికాద‌ని షా సూచించారు. కానీ, ఓవైసీ మాత్రంత‌న‌కు భ‌ద్ర‌త అవ‌స‌రం లేద‌ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News