ఇండియాలో ఉన్న 130 కోట్ల జనాభాయే దేశానికి అతిపెద్ద బలం అని, దేశంలోని ప్రజలందరూ విదేశీ వస్తువులను కొనకూడదని నిర్ణయించుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా పైకి ఎగబాకుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. బాబూ అమిత్ షా... విదేశీ వస్తువులను మనం ఏ విధంగా బహిష్కరించగలమో ఓసారి విడమర్చి చెప్పు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
వివిధ రంగాల్లో మీరే FDIలకు అనుమతి ఇస్తున్నారు. మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమల్లో 88 శాతం విడిభాగాలు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. భారత ఔషధ తయారీదార్లు 70 శాతం బల్క్ డ్రగ్స్ ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంతెందుకు దేశంలోని 60 శాతం వైద్య పరికరాలు దిగుమతి చేసుకున్నవే... ఇవన్నీ ఇలావుంటే ఏ విధంగా విదేశీ వస్తువులను నిషేధించాలి? అంటూ సూటిగా ప్రశ్నించారు.
అటు తబ్లీగి జమాత్ సమావేశాలపై కూడా స్పందించిన ఓవైసీ.. తబ్లిఘీలపై ప్రశంసలు కురిపించారు. సుమారు 38 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు ప్లాస్మా దానం చేయడానికి సిద్దంగా ఉన్నారని.. వీరిలో 25 మంది తెలంగాణవాసులని ఓవైసీ తెలిపారు. అయితే కొంతమంది తబ్లిఘీ జమాత్‌ను సూపర్ స్ప్రెడర్లుగా.. కరోనా జీహాదీలుగా ఆరోపించారని మండిపడ్డారు.