ఆ మహిళా ఎస్పీ గురించి తెలిస్తే నోట మాట రాదంతే

సినిమాల్లోనూ కనిపించని సిత్రమైన క్యారెక్టర్ ఈ మహిళా ఎస్పీది. సాధారణంగా ఎస్పీ స్థాయి అధికారుల్లో చాలామందిని వేలెత్తి చూపించే వీలు ఉండదు

Update: 2025-01-11 08:30 GMT

సినిమాల్లోనూ కనిపించని సిత్రమైన క్యారెక్టర్ ఈ మహిళా ఎస్పీది. సాధారణంగా ఎస్పీ స్థాయి అధికారుల్లో చాలామందిని వేలెత్తి చూపించే వీలు ఉండదు.సినిమాలకు భిన్నంగా రియల్ లైఫ్ లో వారి పని తీరు వేరుగా ఉంటుంది. అయితే.. ఈ రియల్ మహిళా ఎస్పీ గురించి తెలిసిన తర్వాత.. ఇలాంటి క్యారెక్టర్ సినిమాల్లో కూడా ఇప్పటివరకు చూసింది లేదే.. అనుకోకుండా ఉండలేరు. అలాంటి ముదురు ఎస్పీపై తెలంగాణ పోలీసు బిగ్ బాస్ చర్యలు తీసుకున్న వైనం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నిఘా విభాగంలో పని చేసే ఈ మహిళా ఎస్పీ.. డీఎస్పీగా ఉన్నప్పటి నుంచి ఆమె పని తీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటాయి. ప్రస్తుతం ఒక కీలక జిల్లాలో పని చేస్తున్నఆమె తీరు పోలీసు శాఖ మీద గౌరవం తగ్గేలా ఉందన్న విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఏడేళ్ల క్రితం సదరు జిల్లాలో డీఎస్పీగా చేరి.. ప్రస్తుతం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

తన సిబ్బందితో మాత్రమే కాదు కిందిస్థాయి అధికారుల వద్ద అప్పులు తీసుకోవటం.. చేబదులు పేరుతో తీసుకునే డబ్బులకు సంబంధించి తిరిగి ఇచ్చే అలవాటు ఆమెకు తక్కువ. అంతేకాదు.. డబ్బులు ఇచ్చిన వారు తిరిగి తమకు ఇవ్వమని అడిగితే వారికి ఉల్టాగా బెదిరింపులకు దిగే తీరుపై ఆమెకు చాలానే ఘనకీర్తి ఉందని చెబుతారు.

అంతేకాదు.. తన ఇంట్లో జరిగే వేడుకలకు వచ్చే వారికి ఏమేం గిఫ్టులు తీసుకురావాలో కూడా ఆమే చెప్పేస్తుందని.. అలాంటి హిస్టరీ ఉన్న సదరు అధికారిణిపై తెలంగాణ డీజీపీ చర్యల కత్తి దూశారు. ఆమె నిర్వర్తిస్తున్న పదవి నుంచి తప్పిస్తూ.. హెడ్డాఫీసుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వైనం పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక మహిళా ఎస్పీ స్థాయి అధికారిపై ఈ తరహా ఆరోపణలు రావటం చాలా చాలా అరుదుగా పేర్కొంటున్నారు.

Tags:    

Similar News