లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు జీవితం గడుపుతూ కోర్టు కేసులు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత దైవదూత ఆశారాం బాపూ తాను గాడిదల కోవకు చెందిన వాడినని చెప్పారు. ఇటీవల హిందూ సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ అఖారా పరిషద్ ఆశారాం బాపూతో సహా కొంతమందిని నకిలీ సాధువులుగా పేర్కొంది. ఆశారాం సాధువు కానీ - ప్రచారకుడు కాని కాదని పరిషద్ స్పష్టం చేసింది. ఈ విషయమై ఒక విలేకరి ఆశారాంను ప్రశ్నించడంతో ఆశారాం ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. తాను గాడిదల కోవకు చెందిన వాడినని చెప్పాడు.
బాలికపై అత్యాచారయత్నం కేసులో ఆశారాం జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆశారాంను పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఓ రిపోర్టర్ ఆశారాం దగ్గరకి వచ్చి అఖిల భారతీయ అఖారా పరిషత్ సభ్యులు మిమ్మల్ని నకిలీ సాధువు అని..గురువు కాదని అంటున్నారు. మరి మీరు ఏ కేటిగిరీకి చెందుతారని ప్రశ్నించాడు. దీనిపై తనదైన శైలిలో స్పందించిన ఆశారాం నేను గాడిదల కేటగిరీకి చెందిన వాడినంటూ ఆశ్చర్యకర సమాధానమిస్తూ అక్కడి వెళ్లిపోయాడు. ఆశారాం రిైప్లెతో సదరు రిపోర్టర్ కంగుతిన్నాడు.