సెక్షన్‌ 8 మీద ఇప్పుడా మాట్లాడేది ?

Update: 2015-06-24 09:28 GMT
నిర్లక్ష్యం.. నిద్రపోవటం లాంటి పదాలకు నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరిస్తుంటారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు. తోటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండే చురుకుదనం.. వేగం.. ఏపీ క్యాడర్‌లోని వారిలో అస్సలు కనిపించవు.

విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని అమలు చేయాలన్న అంశంపై లెక్క ఏదో తేడా వస్తుందన్న వెంటనే.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. ఉద్యోగసంఘాలు యుద్ధప్రతిపదిక మీద సమావేశమై.. ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించటమే కాదు.. ఆందోళనలు ఏలా నిర్వహించాలి? కేంద్రం మీద ఒత్తిడి పెంచటానికి ఏమేం చర్యలు తీసుకోవాలి లాంటి అంశాల మీద రోడ్‌మ్యాప్‌ అప్పటికప్పుడు సిద్ధం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అంత వేగంగా స్పందిస్తే.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కదలిక ఒక పట్టాన మొదలుకాలేదు. సెక్షన్‌ 8 మీద తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు స్పందించిన 24 గంటల తర్వాత తీరిగ్గా.. తమ వాదనను వినిపించటం మొదలు పెట్టారు సమైక్య ఉద్యమంలో ఆరడుగుల బుల్లెట్‌గా కీర్తించబడిన అశోక్‌బాబు.

అది కూడా ఏపీజేఎఫ్‌ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేవంలో హాజరైన ఆయన.. సెక్షన్‌ 8ని హైదరాబాద్‌లో అమలు చేయాలన్న అంశంపై తమ వాదనను వినిపించారు. విభజన చట్టం చెల్లినప్పుడు.. సెక్షన్‌ 8 ఎందుకు చెల్లదన్న ప్రశ్నను ఆయన సంధించారు. అయితే.. ఇలాంటి ప్రశ్నలు.. సందేహాలన్నీ వెనువెంటనే జరిగిపోవాల్సిందే తప్పించి.. తీరిగ్గా.. వీలు చూసుకొని మాట్లాడాలన్న వైఖరిని ఏపీ ఉద్యోగ సంఘాలు ఎప్పటికి విడిచిపెడతాయన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏపీ ఉద్యోగ సంఘాల్లో అంత స్పందన ఉండే ఛాన్స్‌ ఉందా?

Tags:    

Similar News