పొత్తు ప్రక్కకు పాకుతోంధా...?

Update: 2018-11-12 10:07 GMT
దాదాపు 30 సంవత్సరాల వైరం.... స్నేహంగా మారింది.... మొదట్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ....తెలంగాణకే పరిమితం కదా అనుకున్నారు.. కాని ఈ పొత్తు ఇప్పుడు ఆంధ్రకు పాకునుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు....  .ఎలాగైన గెలవాలి.

ఒక్కసారి గెలిస్తే చాలు అందిన కాడికి సంపాదించుకోవచ్చు.   ... అంతే ఇదీ నేటి రాజకీయ నాయకుల ఆలోచన. నిన్నటి వరకూ కాంగ్రెస్‌ పార్టీని బద్ద శత్రువుగా చూసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తెలంగాణలో తిరిగి పాగా వేయలంటే కాంగ్రెస్‌ తో చేతులు కలపడం ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చారు. అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత మంది సీనియర్ తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే వ్యతిరేకించారు కూడా. అయితే ఈ పొత్తు కేవలం తెలంగాణలో తిరిగి నిలదొక్కుకోవాడానికేనని తమ్ముళ్లను బుజ్జగించారు బాబు.. అయితే ఈ పొత్తు ఇప్పడు తెలంగాణకే పరిమితం కాదని - అది నెమ్మదిగా చాప క్రింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకిందని తెలుస్తోంది.ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం పార్టీ ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంపీ - ఎమ్మెల్యేల సీట్ల బెరసారాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లట్ ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆశోక్ గెహ్లట్ చంద్రబాబు నాయుడిని కలసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ పోటి చేయదల్చిన నియోజకవర్గాల జాబితాను చంద్రబాబు నాయకుడికి అందజేసినట్లు చెప్పుతున్నారు. మొత్తం ముప్పై ఎమ్మెల్యే సీట్లు - ఆరు ఎంపీ సీట్లను ఆంధ్రప్రదేశ్‌ నుంచి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే తెలగుదేశం పార్టీ మాత్రం నాలుగు ఎంసీ సీట్లు - ఇరవై నాలుగు ఎమ్మెల్యె సీట్లు ఇవ్వటానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఓటమి తప్పదు అనుకునే కొన్ని స్దానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి చంద్రబాబు సిద్దంగానే ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తిరుపతి - కర్ణూలు - రాజంపేట నియోజకవర్గాలలో గెలుపుపై తెలుగుదేశం పార్టీకి ఆశలు లేవు.. కాబట్టి ఈ సీట్లను కాంగ్రెస్‌ కు కోరితే చంద్రబాబు నాయుడు పెద్దగా అభ్యంతరం చెప్పరని విశ్లేషకుల అంచన. అయితే రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో పొత్తును అక్కడి ప్రజలు ఆహ్వానిస్నారా... లేదా... అన్నది వేచి చూడాల్సీందే.

Tags:    

Similar News