అశ్వ‌త్థామ దీక్ష విర‌మ‌ణ‌..స‌మ్మెపై కీల‌క ప్ర‌క‌ట‌న‌!

Update: 2019-11-18 15:53 GMT
తెలంగాణా  లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేపట్టిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి దీక్ష‌ విరమించారు. దీంతోపాటుగా, మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ - రాస్తారోకో ను వాయిదా వేసినట్ల చెప్పారు. కాగా, మంగ‌ళ‌వారం స‌మ్మెపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నట్లు వెల్ల‌డించిన‌ నేప‌థ్యంలో....ఆర్టీసీ నేత‌ల వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

ప్రతిపక్ష పార్టీల నేత‌లు సమ్మె చేస్తున్న అశ్వ‌త్థామ‌రెడ్డి - రాజిరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాల నేత‌ల సూచ‌న‌లు - ఉద్య‌మ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ నేప‌థ్యంలో దీక్ష‌ విర‌మించామ‌న్నారు. కోర్ట్ ను తీర్పును గౌరవించి మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ - రాస్తారోకో ను వాయిదా వేసినట్ల చెప్పారు. మంగ‌ళ‌వారం ఉదయం సమ్మెపై కేంద్ర యూనియన్ల కమిటీ సమావేశం జరుగుతుందని - సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కోర్ట్ తీర్పు అనంతరం సమ్మెపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాన జ‌న‌స‌మితి నేత కోదండరా మాట్లాడుతూ - జేఏసీ నేతల ఆరోగ్య రీత్యా  నిరాహార దీక్ష ప్రమాదమని వైద్యులు చెప్పడంతో దీక్ష విర‌మ‌ణ‌ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  రెండు రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులందరూ సమ్మెపై చర్చించామ‌ని - కోర్ట్ తీర్పు నేప‌థ్యంలో నిరాహార దీక్షను విరమించినట్లు కోదండరామ్ తెలిపారు.


Tags:    

Similar News