టీమిండియా స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఇటీవల రవిచంద్రన్ కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో అతడు ఐపీఎల్ కు కొంతకాలంపాటూ దూరమవుతున్నట్టు ప్రకటించాడు. ’ప్రస్తుతం నా కుటుంబసభ్యులను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అంటూ రవిచంద్రన్ ప్రకటించాడు.
రవిచంద్రన్ నిర్ణయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్వాగతించింది. అతడి కుటుంబసభ్యులు తొందరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పేర్కొన్నది.నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. సన్రైజర్స్ హైదరాబాద్ తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ టై అయ్యింది. చివరకు సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు తాత్కాలిక విరామం ప్రకటించాడు.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు రవిచంద్రన్ కీలక బౌలర్ గా ఉన్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటున్నాడు.ఇదిలా ఉంటే అతడి నిష్క్రమణతో ఢిల్లీ ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారని చెప్పక తప్పదు. అశ్విన్ అంతర్జాతీయ స్థాయి ఆటగాడు. ఇప్పటివరకు 409 టెస్ట్ వికెట్లు తీశాడు. టీమిండియా జట్టుకు కూడా కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. అయితే ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ నిష్క్రమణ ఢిల్లీ క్యాపిటల్స్ కు లోటని చెప్పాలి. గత ఏడాది ఫైనల్ వరకు వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి కూడా మెరుగైన ప్రదర్శన ఇస్తోంది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. శిఖర్ ధవన్, పృథ్వీ షా మంచి ఫామ్లో ఉన్నారు. శిఖర్ ధవన్ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు శిఖరే అత్యధిక పరుగులు చేశాడు. మరోవైపు పంత్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.