నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని మంత్రి అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆయన మాత్రం ఎన్నికలకు ముందు ప్రతిసారీ తనపై ప్రత్యర్థులు ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంటారని.. విచారణలో వాస్తవాలేమిటో తేలుతాయని అంటున్నారు.
రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ పై అత్యాచారం కేసు నమోదైంది. గొహైన్ తనపై అత్యాచారానికి పాల్పడడమే గాక బెదిరించారని అసోంలోని నాగావ్ లో ఓ 24 ఏళ్ల వివాహిత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 2న మంత్రిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇదంతా తనపై జరుగుతున్న కుట్ర అని గొహైన్ కొట్టిపారేశారు.
‘‘ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యే ప్రతిసారీ నాపై ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. 2011 - 2016లోనూ ఇలాగే తప్పుడు కేసులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి కుట్రలే చేస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి’’ అని మంత్రి ధీమాగా చెప్పారు.
తనపై ఆరోపణలు చేసిన మహిళ - ఆమె కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారంటూ మంత్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన ఓఎస్డీ తెలిపారు. అనంతరం ఆమె మంత్రిపై ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని కూడా చెప్పారు.అయితే.. పోలీసులు మాత్రం కేసు ఫైల్ అయింది కాబట్టి తాము విచారణ జరుపాతమని అంటున్నారు.