దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో కిక్కిరిసన మీడియా సమావేశంలో షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్ సభలోని మొత్తం 545 స్థానాల్లోని రెండు ఆంగ్లో ఇండియన్ స్థానాలను మినహాయిస్తే... మిగిలిన 543 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మొత్తం ఎన్నికలను ఏడు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి దశ పోలింగ్ జగరనుండగా... రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23, నాలుగో దశ ఏప్రిల్ 29, ఐదో దశ మే 6న, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు అరోడా తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో 175, ఒడిశాలో 147, అరుణాచల్ ప్రదేశ్ లో 60, సిక్కింలో 32 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘాలు, ప్రభుత్వాలతో పలు దఫాలుగా సన్నాహక సమావేశాలు జరిపామని అరోడా తెలిపారు. శాంతి భద్రతలు, బలగాల మోహరింపు పై చర్చలు జరిపామని ఆయన చెప్పారు. నిష్పక్ష, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు అరోడా వివరించారు. దేశవ్యాప్తంగా పండుగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించామన్నారు. వాతావరణం, పంట కోతల సమయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఆయన చెప్పారు.
ఓటర్లు అసౌకర్యానికి గురికాకుండా తాగునీరు, టాయ్‌లెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని అరోడా వివరించారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగానే ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేస్తామని.... దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా లక్ష పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించిన అరోడా.... సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తామని అరోడా వివరించారు.
ఇందులో భాగంగా తొలి దశ లోక్ సభ ఎన్నికలతో పాటే... నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా పూర్తి చేయనున్నట్లు అరోడా వెల్లడించారు. ఈ ఎన్నికల పోలింగ్ ను ఏప్రిల్ 11న నిర్వహించనుండగా... తెలుగు రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రా ఎన్నికలు కూడా అదే రోజున జరగనున్నాయి. ఇక దశలవారీగా జరగనున్న ఎన్నికలు... ఏఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరగనున్నాయన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చిన అరోడా.. మొత్తం జాబితాను విడుదల చేశారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
మొదటి దశ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్ గఢ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ్ బెంగాల్, లక్షద్వీప్
రెండో దశ: జమ్ముకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, పుదుచ్చేరి
మూడో దశ: అసోం, బిహార్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ
నాలుగో దశ: బిహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్
ఐదో దశ: బిహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్
ఆరో దశ: బిహార్, హరియాణా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, దిల్లీ
ఏడో దశ: బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ్ బెంగాల్, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
ఇక ఈ షెడ్యూల్ ప్రకారం ఒక్కో రాష్ట్రంలో సింగిల్ ఫేజ్ లోనే ఎన్నికలు ముగియనుండగా... కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ఏడు దశల్లోనూ పోలింగ్ జరగనుంది. సింగిల్ ఫేజ్ తో పాటు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు దశల పోలింగ్ ఏఏ రాష్ట్రాల్లో జరగనుందన్న విషయాన్ని కూడా అరోడా చాలా క్లారిటీగానే వెల్లడించారు.
సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు పూర్తయ్యే రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్, దాద్రా మరియు నగర్ హవేలీ, డమన్ మరియు డయూ, లక్షద్వీప్, ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్.
రెండు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర.
మూడు దశల్లో ఎన్నికలు జరిగా రాష్ట్రాలు: అసోం, ఛత్తీగఢ్.
నాలుగు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా.
ఐదు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రం: జమ్ముకశ్మీర్.
ఏడు దశల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్.
ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికలు పూర్తి అయ్యేందుకు ఏకంగా నెలకు పైగా సమయం పడుతుండగా... అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత మే 23న అన్ని చోట్లా ఒకేసారి కౌంటింగ్ జరగనుంది. అంటే తొలి విడతలో పోలింగ్ పూర్తయ్యే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలు... ఫలితాల కోసం ఏకంగా నెలకు పైగా నే వేచి చూడక తప్పదన్న మాట.