మంత్రాలకు చింతకాయలు రాలుతాయో ఏమో తెలియదు కానీ.. భార్యలను వదిలేస్తే మాత్రం ఎమ్మెల్యే అవుతారని ఓ జ్యోతిష్యుడు సలహా ఇచ్చాడు. ఓ భర్త గుడ్డిగా నమ్మాడు. సాధారణ ప్రజలు, చదువుకోని వాళ్లు ఇలా మూఢ నమ్మకాలను విశ్వసిస్తే వేరే విషయం కానీ.. ఎంతో చదువుకున్న వాళ్లు రాజకీయ నాయకులు సైతం మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు.
తాజాగా ఓ జ్యోతిష్యుడైన బాబా మాటలు నమ్మిన రాజకీయ నాయకుడు కటకటాల పాలయ్యాడు. జాతకాలు, జ్యోతిష్యం లాంటివి చాలా విశ్వసించే ఓ నాయకుడు ఓ బాబా చెప్పింది చేయడానికి రెడీ అయ్యారు. తన భార్యను వదిలిపెట్టేందుకు రెడీ అయ్యాడు. ‘భార్యను వదిలేస్తే ఎమ్మెల్యే’ అవుతావని ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి కట్టుకున్న భార్యకే విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో సోమవారం వెలుగు చూసింది.
ఫూణే పట్టణానికి చెందిన రఘునాథ్ ఏముల్ తాను ఎమ్మెల్యే లేదా మంత్రి కావాలంటే ఏం చేయాలని హస్త రేఖలు చూసి జాతకం చెప్పే జ్యోతిష్యుడిని అడిగాడు. దీనికి అతడు.. ‘మీ ఇంట్లో నీ భార్య ఉండగా నువ్వు ఎప్పటికీ నీ కలను సాకారం చేసుకోలేవని.. ఆమె మంచిది కాదంటూ పలు నిందలు వేశాడు. తనకు విడాకులు ఇస్తేనే నీకు మంచి భవిష్యత్ ఉంటుందని సలహా ఇచ్చాడు.
ఇది నమ్మిన రఘునాథ్ అనే వ్యక్తి అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. భర్త, అత్తామామ వేధింపులతో విసిగిపోయిన భార్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జ్యోతిష్యుడిని నమ్మి రఘునాథ్ ఈ విధంగా ప్రవర్తించాడని పోలీసులు వెల్లడించారు. జ్యోతిష్యుడిని కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తుచేస్తున్నామని.. ఫూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ తెలిపారు. ఇలా జ్యోతిష్యుడిని మాటలు నమ్మి ఎమ్మెల్యే అవుతానని నమ్మి సొంత భార్యనే వదిలించుకుంటున్న భర్త పరిస్థితి వైరల్ గా మారింది.