శుక్రవారం అర్థరాత్రి వేళ.. ఏపీ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలనకు సంబందించి ఇప్పటికే తన ప్రాధామ్యాల గురించి స్పష్టం చేసిన జగన్ సర్కారు.. అందుకు తగ్గట్లే తాజా నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని.. అందులో భాగంగా కర్నూలు లో న్యాయ రాజధాని గా చేయాలనుకోవటం తెలిసిందే.
ఇందులో భాగంగా తన నిర్ణయాన్ని కొంతమేర అమలు అయ్యేలా తాజా నిర్ణయం ఉండటం ఆసక్తికరంగా మారింది. పాక్షిక న్యాయ విభాగాలైన విజిలెన్స్ కమిషన్.. కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్ సభ్యుల కార్యాలయాల్ని అమరావతి నుంచి కర్నూలు కు మారుస్తున్నట్లుగా పేర్కొంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకూ ఈ కార్యాలయాలన్ని వెలగపూడి లో ఉండేవి. వాటిని కర్నూలుకు మారుస్తున్నట్లుగా శుక్రవారం పొద్దు పోయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాలకు అనుగుణంగా ఆయా విభాగాలకు అవసరమైన భవనాల్ని ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ విభాగం తో పాటు కర్నూలు కలెక్టరేట్ కు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా చూస్తే.. తాను అనుకున్న పనిని వాయిదాల పద్ధతిలో అమలు చేయాలన్న ఆలోచనలో ఏపీ సర్కారు ఉందన్న అభిప్రాయం కలిగేలా తాజా ఆదేశాలు ఉన్నాయని చెప్పక తప్పదు.