శనివారం జరిగిన అమెరికన్ తెలంగాణ అస్సోసియేషన్ ప్రధమ ప్రపంచ సదస్సు లో భాగం గా "తెలుగు సినిమా తోట లో తెలంగాణ పాట" చర్చ లో శ్రీ చంద్ర బోస్ గారు, శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు మరియు శ్రీ రామాచారి గారు పాల్గొన్నారు. కిక్కిరిసిన బాల్ రూం లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ఈ కార్యక్రమం లో భాగంగా శ్రీ చంద్ర బోస్ గారు కొన్ని మధుర స్మృతులను అందరితో పంచుకున్నారు. మగధీర సినిమా లోని "పంచదార బొమ్మ బొమ్మ" పాటకి పడిన శ్రమని వివరించారు.. ఈ మధ్య అన్ని పాటలు బాణీకి రాయాల్సి వస్తుందని.. ఇలా రాయటం సినీ గేయ కవులకు ఒక పెద్ద సవాలు లాంటిది అని చెప్పారు. "పంచదార బొమ్మ బొమ్మ" పాట రాయటానికి 50 రోజులు పట్టిందని. ఇంత కష్టపడి రాసిన ఈ పాటకి పంచ అంటే 5 అవార్డ్స్ వచ్చాయి అని చెప్పారు.
గబ్బర్ సింగ్ లో "ఆకాశం అమ్మాయి ఐతే నీలా వుంటుందే" పాటకి కూడా చాలా కష్టపడ్డా అని, ఈ బాణీ కి చాలా పద ప్రయోగాలు చేసినా.. అవేవి అంతగా నచ్చలేదని.. చివరికి..ఈ పాట గురించి ఆలోచిస్తూ ఒక పెట్రోల్ పుంపు దగ్గర ఆగినప్పుడు అక్కడ పెట్రోల్ పోసే అమ్మాయి ని చూసి.. ఆకాశం వైపు చూడగానే ఒక ఆలోచన వచ్చిందని.. ఆ ఆలోచన రూపమే.. "ఆకాశంఅమ్మాయి అయితే. నీల వుంటుందే" పాట.. ఈ పాటకి కూడా అవార్డ్స్ వచ్చాయని చెప్పారు.. కానీ తనకి అత్యంత ఇష్టమైన పాట నా ఆటోగ్రాఫ్ సినిమా లో "మౌనం గా నే ఎదగమని".ఈ పాటకి ఒక్క అవార్డు కూడా రాలేదని.. కానీ, ఈ పాట ని హైద్రాబాద్ లో ఒక అంధ విద్యాలయం లో రోజు ప్రార్ధనా గీతం లా చదువుతున్నారని తెలిసిందని.. అది ఎన్నో అవార్డులు తీసుకున్న దానికంటే ఎక్కువ ఆనందాన్నిస్తుందని ఆయన చెప్పారు. అలాగే ఆ మధ్య ప్రణీత అనే అమ్మాయి యాసిడ్ దాడికి గురయ్యిందని, ప్రణీత తాను కోలుకుంటున్నప్పుడు బాగా స్ప్పోర్తి పొందిన పాట "మౌనం గానే ఎదగమని" అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పటం తనకి ఆనందంగా ఉందని చెప్పారు.
తరువాత శ్రీ సుద్దాల అశోక్ తేజ్ గారు తాను వ్రాసిన పాటల గురించి చెప్పారు. తనకి బాగా ఇష్టమైన పాట "ఒకటే జననం ఒకటే మరణం... ఒకటే గమనం ఒకటే గమ్యం " ఈ పాట కూడా చాలా మంది కి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.
తరువాత శ్రీ రామాచారి గారి శిష్యులు శ్రీ చంద్ర బోస్ గారి మరియు సుద్దాల అశోక్ తేజ్ గారి పాటలను రసవత్తరం గా ఆలపించారు.