తెలంగాణలో 300 కోట్లు కాజేసిన ‘ఈఎస్ ఐ’ స్కాం జాడలు ఏపీలోనూ వెలుగుచూసినట్లు సమాచారం. దీనిపై వైసీపీ ప్రభుత్వం రహస్యంగా జరిపిన విజిలెన్స్ విచారణలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ దందా సాగిందని తెలిసిందట.. ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న అధికారులు టీడీపీ హయాంలో పనిచేసిన ఇద్దరు మంత్రుల ప్రమేయం ఇందులో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. దీంతో వారికి ఉచ్చు బిగించడానికి వైసీపీ సర్కారు రెడీ అయ్యిందన్న చర్చసాగుతోంది.
తాజాగా ఏపీలోని ఈఎస్ఐ ఆస్పత్రులు - డైరెక్టరేట్ తోపాటు డిస్పెన్సరీలు - డయాగ్నస్టిక్ సెంటర్లలో ఐదురోజులుగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం. అక్రమాలపై ఫోకస్ చేసిన అధికారులు.. ఆ సమయంలో పనిచేసిన అధికారులతోపాటు.. మాజీ మంత్రులపైన విచారణకు రెడీ అవుతున్నట్టు తెలిసింది.
ప్రధానంగా చంద్రబాబుకు రైట్ హ్యాండ్.. వైసీపీకి కంట్లో నలుసుగా మారిన టీడీపీ సీనియర్ నేత - నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆ తర్వాత కార్మిక మంత్రిగా చేసిన పితాని సత్యనారాయణలకు ఈ స్కాంలో ప్రమేయం ఉందా అన్నకోణంలో వైసీపీ సర్కారు సీరియస్ గా విచారణ జరుపుతోందని తెలిసింది. ఇందులో అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో టెలీహెల్త్ సర్వీసెస్ తో ఒప్పందం చేసుకోవాల్సిందిగా రాసిన లేఖ విజిలెన్స్ కు దొరికినట్లుగా చెబుతున్నారు. దాదాపు 10 కోట్లు బిల్లులు.. బయటి ధరల కన్నా ఎక్కువ రేటుకు పరీక్షల మిషన్లు కొన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. టెలీహెల్త్ సర్వీసెస్ సిబ్బంది వేతనాలు గోల్ మాల్ అయినట్టు గుర్తించినట్టు తెలిసింది.
ఇక పితాని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ భారీ ఎత్తున మందులకు ఆర్డర్లు ఇచ్చారని తేల్చారు. పితాని - అచ్చెన్నాయుడు ల వద్ద పనిచేసిన అధికారుల పాత్ర ఉందని విచారణ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీ సర్కారు చేస్తున్న విచారణలో అచ్చెన్నాయుడుపై ఏ ఆధారం దొరికినా ఆయన్ను బుక్ చేయడం ఖాయమన్న చర్చ సాగుతోంది. ప్రతిపక్షం దూకుడుకు కళ్లెం వేయడానికి వారి అవినీతిని బయటకు తీయడమే అజెండాగా వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.