ఏపీ సీఎం చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్న నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ విషయంలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి రోజురోజుకీ ఎక్కువవుతోంది. విపక్ష ఎమ్మెల్యేలే కాకుండా స్వపక్ష సభ్యులూ కొత్త అసెంబ్లీపై పెదవి విరుస్తున్నారు. అర్నెళ్లలో నిర్మించాం.. హైటెక్ గా నిర్మించాం అని చంద్రబాబు చెబుతున్నా అక్కడి సౌకర్యాల లేమి.. అయోమయ ప్లానింగ్, డిజైనింగ్ పై చివరకు మంత్రులు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఏకంగా కొత్త అసెంబ్లీని ఉద్దేశించి అసంతృప్తితో.. ‘‘థూ.. ఇదేం అసెంబ్లీ’ అని అన్నట్లుగా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
అసెంబ్లీ నిర్మాణంపై పలువురు మంత్రులు.. చంద్రబాబుకు భజన చేసేవారు మాత్రం చంకలు గుద్దుకుంటున్నారు. మంత్రి దేవినేని ఉమా కూడా ఇదే తరహాలో అసెంబ్లీ చాలా బాగుందని వ్యాఖ్యానించగా… మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే మండిపడ్డారట. థూ.. ఇదేం అసెంబ్లీ. బాత్‌రూమ్‌ల్లో నీళ్లకు కూడా దిక్కులేదంటూ వ్యాఖ్యానించారట. దీంతో కంగుతిన్న దేవినేని సైలెంటయిపోయారట. కాగా బాత్‌రూమ్‌కు వెళ్లిన తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరు కూడా రావడం లేదని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. బాత్ రూంలు కూడా మగవాళ్లకు, ఆడవాళ్లకు పక్కన పక్కనే నిర్మించడం పైనా పలువురు మహిళా సభ్యలు.. అధికారిణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం మహిళా ప్రజాప్రతినిధులు నేరుగా సీఎంను కలిసి వివరించారు.
కాగా అందరిలోనూ అసెంబ్లీపై ఎంతో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ అచ్చెన్నాయుడు మాత్రం మంత్రి హోదాలో ఉంటూ కూడా దాన్ని మరింత తీవ్రంగా వ్యక్తంచేయడంపై భిన్నాభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఆయన కోపం అసెంబ్లీ కంటే చంద్రబాబుపైనేనని అంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు అచ్చెన్నకు తరచూ క్లాస్ పీకుతుండడంతో ఆయన తనను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో చంద్రబాబు అంటే అచ్చెన్న మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఆయన అసెంబ్లీ విషయంలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/