తెలంగాణ రాష్ట్ర సాధనలో చోటు చేసుకున్న నిరసనలు.. చేపట్టిన ఆందోళనలు అన్ని ఇన్ని కావు. తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఎన్నోచోటు చేసుకున్నాయి. ఇలాంటి వేళలోనూ ఆందోళనలు.. ఉద్రిక్తతలు శ్రుతిమించిన సందర్భాలు ఉన్నప్పటికీ.. వ్యక్తుల్ని టార్గెట్ చేసి దాడులకు పాల్పడే యత్నం లాంటి ఘటన ఒక్కటి చోటు చేసుకోలేదు. ఆంధ్రా ప్రాంత నేతల మీద తమకున్న ఆగ్రహాన్ని మాటలతోనో.. నిరసన రూపంలో చేపట్టారే తప్పించి.. వారున్న ఇళ్ల వద్దకు వెళ్లి హైడ్రామా క్రియేట్ చేయటం.. దాడి ప్రయత్నం లాంటివి అస్సలు లేవు. తాజాగా సీనియర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఘాటు విమర్శల నేపథ్యంలో.. అందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నడిమాండ్ తో ఆయన నివాసాన్ని ముట్టడించిన వైనం తెలిసిందే.
సాధారణంగా అధికారపక్ష నేతల ఇళ్లను విపక్ష నేతలు టార్గెట్ చేస్తుంటారు. నిరసనలు చేపడతారు. అందుకు భిన్నంగాతాజా ఉదంతంలో మాత్రం అధికారపక్ష నేతలే.. విపక్ష అధినేత ఇంటిని టార్గెట్ చేయటం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం పీక్స్ కు చేరిన వేళలోనూ.. నాటి విపక్ష నేత చంద్రబాబు ఇంటి మీదకు ఏ ఒక్కరు వెళ్లింది లేదు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించే కానీ.. ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని కానీ.. ఆయన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
అంతదాకా ఎందుకు తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన వేళలోనే చంద్రబాబు పాదయాత్ర చేపట్టి.. తెలంగాణ వ్యాప్తంగాపర్యటించిన సందర్భంలోనూ ఆయనపై దాడికి యత్నం జరగలేదు. కొద్దోగొప్పో నిరసనలు చేపట్టారే తప్పించి.. అవేమీ తాజాగా జరిగినట్లుగా శ్రుతిమించిన సందర్భం ఒక్కటి కూడా లేదని చెప్పక తప్పదు. అంతేకాదు.. నిరసన హద్దులు మీరుతున్నప్పటికీ పోలీసులు చూస్తూ ఉండిపోవటం లాంటివి మాత్రం ఎప్పుడు చోటు చేసుకున్నది లేదు. ఇలాంటివి ఎవరు చేసినా.. తప్పు పట్టాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారం శాశ్వితం కాదు. కానీ.. ఇలాంటి దరిద్రపుగొట్టు విధానాలు మాత్రం ఒకసారి మొదలైతే.. వాటిని అందరూఫాలో అవుతారు. రాజకీయం మరింత దిగజారటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.