ఓవైసీ ప్రాణాల‌కు ముప్పు .. కేసీఆర్ ఏంటి ఇలా చేశాడు?

Update: 2022-02-04 11:53 GMT
గ‌త కొద్దికాలంగా దేశ రాజ‌కీయాల‌పై స్పందిస్తూ, ఇంకా చెప్పాలంటే దేశంలోని సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ ప‌రిణామాల‌ను త‌న‌దైన శైలిలో విశ్లేషిస్తున్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వైఖ‌రి గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీ గురించి ఆయ‌న విరుచుకుప‌డుతుంటారు. అయితే, త‌న మిత్ర‌ప‌క్ష‌మైన ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కి ఎదురైన షాకింగ్ ఘ‌ట‌న విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెన్స్ చ‌ర్చ‌కు తెర‌లేపింది.

ఉత్తరప్రదేశ్‌ల ఎన్నికల నేప‌థ్యంలో ప్రచారం నిర్వ‌హిస్తున్న అస‌దుద్దీన్ ఓవైసీ మంగ‌ళ‌వారం హపూర్‌ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఆయన కాన్వాయ్ కారుపై దుండగులు కాల్పులు జరప‌డం సంచ‌ల‌నంగా మారింది. హపూర్‌- ఘజియాబాద్‌ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అసదుద్దీన్‌ ట్విట్టర్‌లో స‌మాచారం ఇచ్చారు. చిజారసీ టోల్‌ప్లాజా వద్ద త‌న కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయని వెల్ల‌డించారు. ``ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జర‌ప‌గా కారు పంక్చర్‌ అయింది. వేరే కారులో వెళ్లిపోయా. అందరమూ సురక్షితంగా బయటపడ్డాం. దుండ‌గులు ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. ’ అని వెల్లడించారు.

ఈ ఘ‌ట‌న‌పై హైద‌రాబాద్‌లో అస‌దుద్దీన్ ఓవైసీ పార్టీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కుడి ప్రాణాల‌కు ముప్పు క‌ల్పించిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు తాజా కాల్పుల ఘ‌ట‌న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భద్రతను సమీక్షించింది. ఓవైసీకి CRPF Z కేటగిరీ భద్రతను అందించిందనున్నట్లు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా త‌క్ష‌ణం ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుందని వెల్లడించింది. కాగా ఓవైసీపై దాడి ఘ‌ట‌న‌లో త‌న కీల‌క‌ మిత్ర‌ప‌క్ష పార్టీ నేత ఎలా ఉన్నార‌ని సీఎం కేసీఆర్ ఫోన్లో వాక‌బు చేసి ఉండాల్సింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. జాతీయ నేత‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్న సీఎం కేసీఆర్ ఈ క్ర‌మంలో జాతీయంగా క‌ల‌క‌లం రేపిన ఘ‌ట‌న‌పై మ‌రో విధంగా స్పందిస్తే బాగుండేద‌ని చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News