ఇండియా పాకిస్తాన్ మద్య యుద్ద వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియక సరిహద్దు వెంబడి ఉన్న సామాన్య ప్రజలు మరియు ఆర్మీ హై ఎలర్ట్ గా ఉంటున్నారు. పుల్వామా దాడికి ప్రతీకార దాడి చేసిన ఇండియాపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా ఆ దేశ ఆర్మీ మరియు ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇండియాతో యుద్దం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ శక్తి లేదని పాక్ ఆగుతోంది. అయితే కవ్వింపు చర్యలకు మాత్రం పాల్పడుతూనే ఉంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాకిస్థాన్ కు చెందిన యుద్ద విమానాలు ఇండియా సరిహద్దులపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఈ దాడుల గురించి పాకిస్థాన్ స్పందిస్తూ... తాము చేసిన దాడి ప్రతికార దాడి కాదని, తమ సరిహద్దును కాపాడుకోవడానికి మరియు తమ గగణతలంను కాపాడుకోవడానికి చేసిన దాడులే అంటూ ప్రకటించింది.
తాము జనాలు లేని చోట మాత్రమే దాడులు జరిపామని, తమ దేశ రక్షణలో భాగంగానే తాము ఈ దాడి చేసినట్లుగా ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. యుద్ద వాతావరణం సృష్టించాలనేది తమ ఉద్దేశ్యం కాదని, తమ దేశాన్ని కాపాడుకోవడం అనేదే తమ ముందున్న ప్రధాన లక్ష్యం. ఒక వేళ భారత్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మేము ఊరుకోబోమని ఇది హెచ్చరిక మాత్రమే. పట్టపగలు వైమానిక దాడులు చేసి తమ అప్రమత్తతను తెలియజేశాం.
సరిహద్దుల్లో శాంతి కోరుకుంటున్నాం అంటూ మాట్లాడే భారత్ ఇప్పుడు తాము యుద్దానికి దిగేలా రెచ్చగొడుతుంది అంటూ భారత్ పై పాకిస్తాన్ ఆరోపణలు చేసింది. ఉగ్రవాదాన్ని సాకుగా చూపి మాపై దాడి చేస్తే, మా దేశంలో జరుగుతున్న ఉగ్ర దాడులను సాకుగా చూపి మేము కూడా భారత్ పై దాడులు చేస్తామంటూ పాక్ హెచ్చరించింది. భారత గగనతలంపైకి వచ్చిన ఒక పాకిస్థాన్ యుద్ద విమానంను వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనక్కు పంపించడం జరిగింది. మొత్తానికి ఇండియాను పదే పదే పాకిస్థాన్ కవ్విస్తూనే ఉంది.