జగన్ పై ఏపీలోని విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నంపై వైసీపీ పోరుబాట పట్టింది. ఈ కుట్రకోణాన్ని వెలికి తీయాలని న్యాయం గడప తొక్కింది. వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలైంది.
జగన్ పై హత్యాయత్నం కుట్రపూరితంగా జరిగిందని.. ఈ విషయంలో కేంద్రంలోని సీబీఐ చేత విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపైనే అనుమానాలున్న నేపథ్యంలో థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. సీఐఎస్ఎఫ్ అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకోవడంతోపాటు సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.
వైసీపీ మాజీ ఎంపీ వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా ఇలానే వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్ - అమర్ నాథ్ రెడ్డిలు కూడా పిటీషన్ జగన్ పై హత్యాయత్నంపై సీబీఐ విచారణ జరపించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ ముగ్గురి పిటీషన్లను కలిపి కోర్టు విచారించనుంది.