హైదరాబాద్ లోని ఓ పబ్బులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఓ యువకుడు.. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మీద చేతులు వేస్తూ లైంగిక దాడికి యత్నించాడు. దీన్ని సదరు బాధితురాలు ప్రతిఘటించింది. అంతేకాదు.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధపడింది. ఈ విషయం పబ్ యాజమాన్యానికి చెప్పి.. సీసీ ఫుటేజీ ఇవ్వాలని కోరింది.
అయితే.. దానికి పబ్ నిర్వాహకులు అంగీకరించలేదు. సీసీ ఫుటేజీ బయటకు వెళ్తే తమ పబ్ పరువు పోతుందని, ఇది తమ బిజినెస్ కు ఇబ్బందిగా మారుతుందని చెప్పి నిరాకరించారు. అంతేకాదు.. పోలీసులకు సైతం ఈ విషయమై ఫిర్యాదు చేయొద్దని చెప్పారు. దీనిపై బాధితురాలు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే తాము మౌనంగా ఉండాలా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది.
దీంతో.. నిర్వాహకులు బాధితురాలిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అనంతరం బాధితురాలు పంజాగుట్టా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బాధితురాలు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. సదరు పబ్ గతంలోనూ పలుమార్లు వివాదానికి కేంద్ర బిందువైంది. నిర్వాహకులు ఇలాంటి విషయాల్లోనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.